Sindhu Menon : గుర్తు ప‌ట్ట‌లేకుండా మారిపోయిన చంద‌మామ మూవీ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

August 21, 2022 10:03 PM

Sindhu Menon : 2001లో శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మళ‌యాళీ ముద్దుగుమ్మ సింధూ మీనన్. ఈమె మళ‌యాళీ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకుంది. సింధు మీనన్ అనేక డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని విజేతగా ఎన్నో బహుమతుల‌ను గెలుచుకుంది. సింధు మీనన్ విజేతగా నిలిచిన సమయంలో ఆ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కె వి జయరాం సింధు మీనన్ ను వెండి తెరకు పరిచయం చేయడం జరిగింది. 1994 లోజయరాం దర్శకత్వం వహించిన రశ్మి అనే కన్నడ చిత్రంతో సింధు మీనన్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

1999లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సింధు మీనన్. ఆ తర్వాత తెలుగులో భద్రాచలం, త్రినేత్రం, శ్రీరామచంద్రులు, చందమామ వంటి పలు సినిమాలలోనటించి తెలుగు తెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. చందమామ, వైశాలి వంటి సినిమాలతో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సింధుమీనన్. ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మళ‌యాళ భాషల్లో నటించి తనకంటూ ప్రేక్షకులలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Sindhu Menon changed a lot see how she is now
Sindhu Menon

తెలుగువారిలో సింధు మీనన్ కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తర్వాత అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పటి తరం వారికి చాలా వరకు సింధుమీనన్ తెలియకపోవచ్చు. చిత్రాలకు దూరమైన తర్వాత వంశం అనే మళ‌యాళం సీరియల్ ద్వారా సింధుమీనన్ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాకుండా టీవీ షోలలో హోస్ట్ గా కూడా పనిచేసింది. ఆ తర్వాత 2010లో ఐటీ ప్రొఫెషనల్ అయిన‌ డొమినిక్ ప్రభును వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప కూడా ఉన్నారు. తాజాగా సింధు మీనన్ ఫ్యామిలీతో దిగిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల‌లో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now