Mahesh Babu : మొద‌టిసారి షర్ట్ లేకుండా క‌నిపించిన మ‌హేష్ బాబు.. ఫొటో వైర‌ల్‌..!

August 20, 2022 12:48 PM

Mahesh Babu : టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు ఉన్నా.. సూపర్ స్టార్ మ‌హేష్ బాబు స్టైలే వేరు. ఆయ‌న సిక్స్ ప్యాక్ బాడీ ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ ష‌ర్ట్ లేకుండా క‌నిపించ‌లేదు. గ‌తంలో ఆయ‌న సినిమాల్లోకి కొత్త‌గా వ‌చ్చిన‌ప్పుడు స‌న్న‌గా, బ‌క్క ప‌లుచ‌గా ఉండేవారు. కానీ త‌రువాత ఇత‌ర హీరోల మాదిరిగానే ఫిట్ నెస్‌ను సాధించాడు. అయిన‌ప్ప‌టికీ ఎన్న‌డూ ష‌ర్ట్‌ను విప్పింది లేదు. అయితే తాజాగా ఆయ‌న ష‌ర్ట్ లేకుండా క‌నిపించే స‌రికి అంద‌రూ షాక‌వుతున్నారు. ఆయ‌న ఫిజిక్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

మ‌హేష్ బాబు తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్‌లో ష‌ర్ట్ లేకుండా ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. అందులో మ‌హేష్‌ను చూసిన ఆయ‌న ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. తొలిసారిగా మ‌హేష్ ఇలా ష‌ర్ట్ లేకుండా క‌నిపించ‌డం విశేషం. అయితే త‌న నెక్ట్స్ సినిమాలో ఆయ‌న కొన్ని సీన్ల‌లో ఇలా క‌నిపిస్తార‌ట‌. అందుక‌నే ఇప్ప‌టి నుంచే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌హేష్ ఇటీవ‌లే స‌ర్కారు వారి పాట చిత్రంతో హిట్ కొట్టగా.. ఆయ‌న త‌న త‌దుప‌రి సినిమాను త్రివిక్ర‌మ్‌తో చేస్తున్నారు.

Mahesh Babu first time appeared like this photo viral
Mahesh Babu

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న మ‌హేష్ మూవీ గూఢ‌చారి మూవీగా ఉంటుంద‌ని సమాచారం. ఇందులో మ‌హేష్‌కు జోడీగా ఇప్ప‌టికే బుట్ట‌బొమ్మ పూజా హెగ్డెను ఎంపిక చేశారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now