Allu Arjun : మెగా ఫ్యాన్స్ ను మళ్లీ రెచ్చగొట్టిన అల్లు అర్జున్.. బన్నీని టార్గెట్ చేసిన మెగా ఫ్యాన్స్‌..

August 19, 2022 11:45 AM

Allu Arjun : పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రేంజ్ అమాంతం పెరిపోయింది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. అయితే బన్నీ మొదటి నుంచే మెగా హీరోల్లో తన శైలి వేరు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయన తీరు కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా ఉంటుంది. మరో వైపు ఆయన మెగా కాంపౌండ్ హీరో అనిపించుకునేందుకు ఆసక్తి చూపరు అంటూ కొందరి అభిప్రాయం. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ తో ఎప్పటికప్పుడు కోల్డ్‌ వార్‌ నడుపుతూ ఉండే అల్లు అర్జున్‌ ఈసారి మెగాస్టార్‌ చిరంజీవిని టార్గెట్‌ చేసిన వారికి మద్దతుగా నిలిచి దుమారం రేపిన విషయం తెల్సిందే.

బింబిసార సినిమా విడుదల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కళ్యాణ్ రామ్‌ అభిమానులు ఆయన్ని మెగాస్టార్ అంటూ సంబోధిస్తూ ఉన్న సమయంలో అల్లు అర్జున్ వెళ్లి కళ్యాణ్ రామ్‌ కి మద్దతు తెలపడం.. బింబిసార సినిమాకు ప్రశంసలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్‌ చేశారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్‌ పై విమర్శల వర్షం కురిపిస్తూ కొందరు అల్లు అర్జున్‌ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మెగా కాంపౌండ్‌ హీరోలు అంతా ఒక్క మాటపై ఉండకుండా అయ్యిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mega fans very angry on Allu Arjun
Allu Arjun

ఇదిలా ఉండగా మొన్న అల్లు రామలింగయ్య ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా పునాది అని రాసుకొచ్చారు. దీన్ని బట్టి బన్నీ అల్లు ఫ్యామిలీకి చెందిన వాడే కానీ మెగా ఫ్యామిలీ కాదు అని చెప్పకనే చెప్పాడు. అలాగే అనేక వేదికలపై పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అభిమానులు అరుస్తూ ఉంటే అల్లు అర్జున్ ఇబ్బందిపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ని ప్రేమగా నా ఆర్మీ అంటూ సంభోధిస్తాడు కానీ మెగా ఫ్యాన్స్ ను వేరుగా చూస్తాడు.

దీంతో అల్లు అర్జున్‌ తీరును మరోసారి ట్విట్టర్ ద్వారా మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. బన్నీ ఇలాగే వ్యవహరిస్తే ఆయన పుష్ప 2 సినిమాను బ్యాన్‌ చేయాల్సి ఉంటుందని అభిమానులు హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ అభిమానులకు, మెగా ఫ్యాన్స్ కి మధ్య వైరం ముదురుతోంది. ఇది కనుక పెరిగితే మెగా కాంపౌండ్ సినిమాల‌ విడుదల సమయంలో రచ్చ జరగడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now