Actor Shivaji : ఆ వీడియో గోరంట్లది కాదు.. నాది.. అంటూ హీరో శివాజీ షాకింగ్ కామెంట్స్.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ..!

August 19, 2022 11:01 AM

Actor Shivaji : టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివాజీ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరమైన శివాజీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ సానుభూతి పరుడిగా చంద్రబాబు గెలుపుకోసం బాగానే కష్టపడ్డారు. ఎన్నికల ముందు ఆపరేషన్ గరుడ అంటూ హాట్ టాపిక్ అయ్యారు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ మీటింగ్‌లో పాల్గొన్న హీరో శివాజీ వైసీపీపై పొలిటికల్ పంచ్‌లు వేశారు.

శివాజీ మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్నా.. నిజాయితీగా ఉన్న నాయకుడ్ని ఎన్నుకోండి. వెయ్యి, రెండువేలకు ఓట్లు అమ్ముకోవద్దు. నోటు, ఓటు, కోటర్‌కి పడిపోవద్దు.. పవన్ కళ్యాణ్ గారు ఓటు చీలకూడదని అంటారు.. అది అక్షరాలా నిజం. అందుకోసం ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మనకి అనవసరం. ప్రస్తుతకాలంలో కబ్జాలు, ఇసుక, మందు దందాలు నడుస్తున్నాయి. వీళ్లు ఏమనుకుంటున్నారంటే.. జనానికి డబ్బు పెట్టేశాను కదా.. ఓట్లు పడతాయిలే అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో నుంచి బయటకురా.. జనంలోకి వచ్చి చూడు.. నీకు ఓట్లు వేయరు. నేను ఇప్పటికి 42 నియోజక వర్గాల్లో సర్వే చేయించాను. దీపావళి, సంక్రాంతి మధ్యలో నా సర్వే రిపోర్ట్ ఇస్తాను. నిజం చెప్పాలంటే.. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలో వెయ్యి రెండు వేల ఓట్లతో బయటపడతారు అన్నాడు శివాజీ.

Actor Shivaji sensational comments on MP Gorantla Madhav
Actor Shivaji

గోరంట్ల మాధవ్ ఏం చేశాడో సీఎంకు తెలుసు.. కానీ ఎందుకు ఊరుకుంటున్నారంటే.. ఈయన గురించి మాట్లాడితే అంబటి గురించి అవంతి గురించి మాట్లాడాలి, ఎందుకొచ్చిందిలే అని.. ఏమండీ గురువుగారూ మనోడిది ఏం లేదని చెప్పేయండని అన్నారు.. ఆయన చెప్పేశారు అంటూ సెటైర్లు వేశారు శివాజీ. ఆ వీడియో మాధవ్‌ది కాదంట.. నాదంట.. మరి నిజంగానే నాదేనేమో! జగన్ గారికి కూడా తెలుసు ఆ వీడియో ఎవరిదో. అందుకే వచ్చే ఎన్నికలకు మాధవ్‌కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు. ఆ వీడియో మాధవ్‌దే అని జగన్ గారికి తెలుసు.. కానీ చెప్పరు.. ఎందుకంటే అదే రాజకీయం ! వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని నటుడు శివాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now