Viral Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు ప‌ట్టారా..? ఇప్పుడు హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది..!

August 17, 2022 8:05 PM

Viral Photo : సౌత్‌లో సినిమా స్టార్స్‌ను బాగా అభిమానిస్తారు, ఆరాధిస్తారు. కొందరు స్టార్స్‌కు గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో.. సినిమా సెలబ్రిటీలు అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్‌‌‌తోపాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటున్నారు.

అవి క్షణాల్లో వైరల్‌ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సాయి పల్లవి, పూజా హెగ్డె, కీర్తి సురేష్, రష్మిక మందన్న‌ ఇలా చాలామంది హీరోయిన్స్ చైల్డ్‌హుడ్ ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. తాజాగా ఇదే కోవలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఈమె టాలీవుడ్, కోలివుడ్‌లలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Viral Photo have you identified Nivetha Pethuraj in this picture
Viral Photo

తమిళంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్.. తెలుగులో యంగ్ హీరోలతో కూడా ఆడిపాడింది. మూవీస్ మాత్రమే కాదు.. ఫార్ములా వన్ రేసింగ్‌లో తన మార్క్ చూపిస్తోంది. ఇంకా గుర్తుకు రాలేదా.. ఆ ఫోటోలో ఉన్నది నివేతా పేతురాజ్. మెంటల్ మదిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నివేదా. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, అల.. వైకుంఠపురం, రెడ్ అలాగే ఇటీవల విడుదలైన విరాట పర్వంలో కూడా నివేతా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం నివేతా చిన్నప్పటి ఫోటో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్లు ఈ ఫోటోపై స్పందిస్తూ చిన్నప్పుడు నివేతా పేతురాజ్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now