iPhone : బంప‌ర్ ఆఫ‌ర్‌.. భారీ త‌గ్గింపు ధ‌ర‌కు ఐఫోన్‌..!

August 17, 2022 10:55 AM

iPhone : చేతిలో యాపిల్ ఐఫోన్ ఉంటే చాలు వాళ్లెంత రిచ్చో అనుకుంటారు చూసిన వాళ్లు.. కానీ ఇప్పుడు మీరు కూడా ఐఫోన్ కొనాలనే కోర్కెను తీర్చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఈ అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తోంది. ఐఫోన్లపై బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనే ధరలోనే ఇప్పుడు ఐఫోన్ కూడా వచ్చేస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్ కార్ట్ ఐఫోన్ 11 పై (Apple i Phone 11) భారీ తగ్గింపును అందిస్తోంది.

ఇక ఐఫోన్ 11 ఫీచర్ల విషయానికి వస్తే.. యాపిల్ ఐఫోన్ 11 బ్లాక్ వేరియంట్ లో 64 జీబీ స్టోరేజ్‌ తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.1 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే క‌లిగి ఉంది. ఇక కెమెరా ఫీచ‌ర్స్ చూసుకుంటే బ్యాక్ కెమెరా12 మెగా ఫిక్స‌ల్+12మెగా పిక్స‌ల్.. అలాగే ఫ్రంట్ కెమెరా 12 మెగా పిక్స‌ల్ అందిస్తోంది. అలాగే ఏ 13 బ‌యోనిక్ చిప్ ప్రాసెస‌ర్ తో ప‌నిచేస్తుంది.

bumper offer on iPhone 11 in flipkart
iPhone

ఎంత వరకు తగ్గిస్తుంది, ఎక్సేంజ్ ఆఫర్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.. యాపిల్ ఐఫోన్ 11 (బ్లాక్, 64 GB) అసలు ధర రూ.49,900 కాగా, ఫ్లిప్ కార్టులో ‌రూ.41,999కే లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీనిపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. యాపిల్ ఐఫోన్ 11పై రూ.17,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. ఫోన్ కండిషన్‌లో ఉండాలి, అలాగే కొత్తగా కూడా ఉండాలి. అప్పుడే ఆఫర్ వర్తిస్తుంది. ఇలా అన్నీ చూసుకుంటే ఐఫోన్ మీకు రూ.24,999కు వస్తుంది. దీనిపై ఈఎమ్‌ఐ ఆఫ్షన్ కూడా ఉంది. నెలకు రూ.1,436 చెల్లిస్తే సరిపోతుంది. అంత ఖరీదు పెట్టి కొన్న ఫోన్ అంతే జాగ్రత్తగా మెయిన్‌టెయిన్ చెయ్యాలి. లేదంటే మాములు ఫోన్‌కి ఐఫోన్‌కి తేడా లేకుండా పోతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now