గూగుల్‌లో RRR అని టైప్ చేసి సెర్చ్ చేయండి.. వ‌చ్చే చిత్రాన్ని గ‌మ‌నించండి..

August 13, 2022 10:25 PM

RRR : లెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ అఖండ విజ‌యాన్ని సాధించింది. అంతే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ప్ర‌శంస‌లు అందుకుంది. మ‌న సినిమాల‌కు ఉన్న హ‌ద్దుల‌న్నీ చెరిపేసి వ‌సూళ్ల ప‌రంగా కొత్త రికార్డులు నెల‌కొల్పింది. ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైప్ప‌టి నుండి భాష‌తో సంబంధం లేకుండా ఇప్ప‌టికీ ఎన్నో దేశాలకు చెందిన‌ ప్రేక్ష‌కులు ఈ సినిమాకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే లేటెస్ట్ గా గూగుల్ త‌న వెబ్ సైట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి, ఆ సినిమా అభిమానుల‌కి ఒక ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ని అందించింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి గూగుల్ సెర్చ్ లో వెతికిన‌పుడు ఒక బైక్ ఇంకా ఒక గుర్రం ఒక దాని వెంట ఒక‌టి ప‌రిగెడుతున్న‌ట్టుగా క‌నిపించేలా ఉన్న యానిమేష‌న్ ను గూగుల్ త‌న వెబ్ సైట్ లో పొందుప‌రిచింది. ఇది ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులను ఎంత‌గానో అల‌రిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం త‌మ ట్విట్ట‌ర్ హ్యాండిల్ లో గూగుల్ సెర్చ్ లో ఈ విధంగా మా సినిమాను గౌర‌వించి మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్యప‌రిచినందుకు, మా సినిమాకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణను, ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపుని తెలియ‌జేసినందుకు థాంక్యూ.. అని గూగుల్ కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

type RRR in Google and see what happens
RRR

ఇంకా గూగుల్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను సెర్చ్ చేసి ఆ స్క్రీన్ షాట్ కి #RRRTakeOver #RRRMovie అనే హాష్ ట్యాగ్స్ ను జ‌త‌చేసి త‌మ‌కి షేర్ చేయాల‌ని కోరారు. కాగా లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకో గుర్తింపుని సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో శాట‌ర్న్ అవార్డ్స్ కి 3 విభాగాల్లో ఎంపికైనట్లు స‌మాచారం. అమెరికాలోని అకాడెమీ ఆఫ్ సైన్స్ ఫిక్ష‌న్, ఫాంట‌సీ అండ్ హార్ర‌ర్ ఫిల్మ్స్ అనే సంస్థ ఆధ్వ‌ర్యంలో సైన్స్ ఫిక్ష‌న్, ఫాంట‌సీ, హార్ర‌ర్ లాంటి అంశాల‌తో రూపొందిన గొప్ప సినిమాల‌కు ఈ అవార్డ్స్ అందిస్తారు. ఈ ఫ‌లితాల‌ను అక్టోబ‌రు 25న ప్ర‌క‌టిస్తార‌ని తెలిసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now