Naga Chaitanya : ఆ స‌మ‌యంలో నాకు చాలా బాధేసింది.. నాగ‌చైత‌న్య ఎమోష‌నల్‌..

August 14, 2022 5:59 PM

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస హిట్స్, వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. సమంతతో విడాకుల‌ తర్వాత చైతూ సినిమాలతో బిజీగా అయిపోయాడు. అక్కినేని కుటుంబ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా జోష్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చైతూ.. తొలి సినిమా ద్వారా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు.

అయితే తర్వాత తనని తాను మార్చుకుంటూ లవ్‌ స్టోరీలు, మాస్‌ మూవీస్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విజయాలతోపాటు అపజయాలు సైతం ఎదుర్కొన్నాడు చైతన్య. తాజాగా లాంగ్‌ సింగ్‌ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు చై. లాల్‌ సింగ్‌ చడ్డా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చైతన్య ఆసక్తికరమైన‌ విషయాలను వెల్లడించాడు.

Naga Chaitanya said he got emotional when first film flopped
Naga Chaitanya

జోష్‌ మూవీ విడుదల సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్న నాగచైతన్య.. జోష్‌ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి థియేటర్‌కు వెళ్లాను. మూవీ ప్రారంభమైనప్పుడు అందరూ బాగానే ఎంజాయ్‌ చేశారు. కానీ సినిమా సగానికి వచ్చేసరికి చాలా మంది థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనించాను. ఆ సమయంలో నాకు చాలా బాధేసింది, అది నా హృదయాన్ని గట్టిగా తాకింది. ప్రేక్షకుల్ని మెప్పించడం నా వల్ల కాదనిపించింది. ఆ సంఘటన నాకెన్నో విషయాల‌ను నేర్పించింది.

ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి.. ప్రేక్షకుల రియాక్షన్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటా.. అని చెప్పుకొచ్చాడు చైతన్య. వరుసగా విడుదలైన చైతూ థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా నిరుత్సాహపరిచినా రానున్న రోజుల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ తో అభిమానులను అలరించనున్నాడు అక్కినేని వారసుడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now