Rajamouli : ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి స‌క్సెస్‌.. న‌టుడిగా మాత్రం ఫెయిల్‌..

August 14, 2022 10:03 AM

Rajamouli : ఒకే ఒక్క సినిమాతో మన తెలుగు తెర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఘన విజయాన్ని అందుకొని ప్రపంచ దృష్టిని మన టాలీవుడ్ వైపు తిప్పేశాడు. మరొకసారి ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ దర్శకుల స్టామినా ఏంటో చాటిచెప్పారు. రాజమౌళి ఏ చిత్రమైనా దర్శకత్వం వహిస్తున్నాడు అనే వార్త వినిపిస్తే చాలు.. ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా.. అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు.

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈగ చిత్రం ఆడియో ఫంక్షన్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. నాలో దర్శకుడే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇదే విషయంపై రాజమౌళి మగధీర సినిమా టైంలో సినిమా మేకింగ్ వీడియోలతో తన కోరికను నెరవేర్చుకున్నా.. అంటూ చెప్పారు. అంతేకాదు రాజమౌళి అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలలో గెస్ట్ రోల్స్ కూడా చేశారు.

Rajamouli succeeded as director failed as an actor
Rajamouli

ఆయనే దర్శకత్వం వహించిన బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో మద్యం వ్యాపారిగా చిన్న అతిథి పాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా రాజమౌళి ఇతరులు దర్శకత్వం వహించిన చిత్రాలలో కూడా అతిథి పాత్రల‌లో కనిపించారు. విరించి వర్మ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను చిత్రం చివర్లో రాజమౌళి అతిథి పాత్రలో నటించారు.

మ‌జ్ను మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వి.ఎస్ ఆదిత్య తెరకెక్కించిన రెయిన్ బో చిత్రంలో కూడా రాజమౌళి గెస్ట్ రోల్ లో నటించారు. ఈ చిత్రం అనుకున్న మేరకు విజయం సాధించలేకపోయింది. దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న రాజమౌళి నటుడిగా ఒక ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now