Kajal Aggarwal : త‌న కొడుకు కోసం క‌ట్ట‌ప్ప‌లా మారిన కాజ‌ల్ అగ‌ర్వాల్..!

August 11, 2022 10:09 PM

Kajal Aggarwal : అందాల తార కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తోంది. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ త‌ర‌చూ పోస్టులు పెడుతోంది. కోవిడ్ లాక్ డౌన్‌లోనూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వీడియోలు, పోస్టుల‌తో ఫాలోవ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ఈమె తాజాగా త‌న కొడుకుతో క‌లిసి దిగిన ఫొటోతో షేర్ చేసిన ఒక పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఈమె 2020 లో త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వ్యాపార‌వేత్త అయిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లి చేసుకోగా వారికి ఈ మ‌ధ్యే ఏప్రిల్ లో మ‌గ బిడ్డ జ‌న్మించాడు. ఇక వీరి బిడ్డ పేరుని నీల్ అని కూడా ప్ర‌క‌టించారు. అయితే ఆమె తాజాగా బాహుబ‌లి సినిమాలోని అప్పుడే పుట్టిన బాహుబ‌లి కాలుని క‌ట్ట‌ప్ప త‌న త‌ల‌పై పెట్టుకునే స‌న్నివేశాన్ని అనుక‌రిస్తూ త‌న కొడుకు నీల్ కాలుని త‌న త‌లపై పెట్టిన ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. దానికి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని కూడా టాగ్ చేసింది. అలాగే రాజ‌మౌళిని ఉద్దేశిస్తూ సార్ ఇది మీ ప‌ట్ల నాకు ఇంకా నా కొడుక్కి ఉన్న అభిమానానికి ఆయ‌న‌కి డెడికేట్ చేయ‌కుండా ఎలా ఉండ‌గ‌లను అని రాసింది.

Kajal Aggarwal turned like Kattappa for her son
Kajal Aggarwal

ప్ర‌స్త‌తం కాజ‌ల్ భార‌తీయుడు 2, క‌రుణ్గాపియం, ఉమా అనే సినిమాల్లో న‌టిస్తోంది. అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్ లో రాబోతున్న‌ భార‌తీయుడు 2 మూవీలో కాజ‌ల్ హీరోయిన్ గా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. ఈమె సెప్టెంబ‌ర్ 13 నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన‌నుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now