అరెరె.. బింబిసార‌లో క‌ల్యాణ్ రామ్ బ‌దులుగా బాల‌య్య చేసి ఉంటేనా.. బాక్సాఫీస్ షేక్ అయ్యేది..!

August 19, 2022 2:25 PM

బింబిసార చిత్రంతో సెన్సేషనల్ సక్సెస్ ని అందుకున్నారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. యువ దర్శకుడు వశిష్ట‌ కూడా ఈ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దర్శకుడు వశిష్ట‌ అందించిన పవర్‌ఫుల్‌ కథాంశం  ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బింబిసార చిత్రంతో ఇండస్ట్రీ మంచి ఊపందుకుంద‌ని చెప్పవచ్చు.

నిర్మాణ సంస్థకు భారీ లాభాలను రాబడుతూ బింబిసార బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బాటగా దూసుకుపోతుంది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా బింబిసార రూ.15 నుండి రూ.16 కోట్ల‌ను వసూలు చేయడం విశేషం. ఇప్పుడు మరో కొత్త విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

what happens if balakrishna does bimbisara movie

నటసింహం బాలయ్య గానీ బింబిసార వంటి పవర్ ఫుల్ కథాంశంలో నటించి ఉంటే రికార్డులు దద్దరిల్లిపోయేవి అనే వార్త ప్రచారం అవుతోంది. ముందుగా ఈ చిత్రానికి గాను దర్శకుడు వశిష్ట‌ బాలయ్య బాబును  హీరోగా అనుకున్నారట. క్రూరంగా ప్రజలను, చంటి పిల్లలను చంపడం వంటి నెగిటివ్ షేడ్ ల‌లో బాలయ్య బాబుని చూపించడం తగదని వశిష్ట‌ వెనక్కి తగ్గి ఉండవచ్చు అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బాలయ్య బాబుకు లేకపోతే ఏమైంది.. కళ్యాణ్ రామ్ కూడా ఈ కథకు పర్ ఫెక్ట్‌ గా సెట్ అయిపోయారు. కళ్యాణ్ రామ్ నటన చూసినవారు థియేటర్లలో అదరహో అంటున్నారు. ఏదేమైనప్పటికీ వరుస విజయాలతో నందమూరి ఫ్యామిలీ అభిమానులకు కన్నుల పండుగ చేస్తున్నారు. అఖండతో బాలకృష్ణ, ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు బింబిసార‌తో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment