ఉద‌య్ కిరణ్ నా కాళ్లు ప‌ట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు.. సీనియ‌ర్ న‌టి సుధ ఎమోష‌న‌ల్‌..

August 19, 2022 2:24 PM

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా.. చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదాను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి హిట్‌లు, ఫ్లాప్‌లు అందుకున్న అతడి జీవితం చివరకు విషాదంగా ముగిసింది.

ఉద‌య్ కిర‌ణ్ వంటి యంగ్ స్టార్ అకాల మ‌ర‌ణం చెంద‌డం చాలా మందిని బాధ‌పెట్టింది. ఉద‌య్ కిర‌ణ్‌తో అనుబంధం ఉన్న‌వారి మాన‌సిక సంఘ‌ర్ష‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టిగా పేరున్న సుధ‌.. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఉద‌య్ కిర‌ణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటి సుధ మాట్లాడుతూ.. ఉదయ్ కిర‌ణ్‌కి చిన్న‌ప్పుడే త‌ల్లి చ‌నిపోయింది. తండ్రి దూర‌మ‌య్యాడు. మ్యారేజ్ లైఫ్ డిస్ట‌ర్బ్‌ అయ్యింది. ఒంటరితనంలో ఉండిపోయాడు. నేను కూడా అలాంటి ప‌రిస్థితుల‌నే ఎదుర్కొన్నాను. అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న ఉద‌య కిర‌ణ్‌ని చూసిన‌ప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ ఏమో అనిపించింది.

senior actress sudha emotional about uday kiran

ఒక‌వేళ త‌ను ఈ రోజు ఉండుంటే ఉద‌య్ కిర‌ణ్ హీరోనా, సినిమాలు చేస్తాడా.. చేయ‌డా! అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టేస్తే నా ప్రాప‌ర్టీ అంతా త‌న‌కు ద‌క్కేది. వాడు హ్యాపీగా ఉండేవాడు. నేను ఉద‌య్ కిర‌ణ్‌ను ద‌త్త‌త తీసుకోవాల‌నుకున్నాను. కోర్టులో దానికి సంబంధించిన పేప‌ర్స్ అన్నీ స‌బ్‌ మిట్ చేశాం. కోర్టు నుంచి ఆర్డ‌ర్ వ‌స్తే ద‌త్తత తీసుకోవ‌చ్చు. ఈలోపు త‌ను ఫోన్ క‌ట్ చేశాడు. మాట‌లు త‌గ్గిపోయాయి. నా కూతురు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. మా అంద‌రినీ దూరం పెడుతూ వ‌చ్చాడు.

ఉద‌య్ కిర‌ణ్ పెళ్లి చేసుకోబోయే సంగ‌తి కూడా నాకు చెప్పలేదు. ఆ అమ్మాయి ఎవ‌రో కూడా నాకు తెలియ‌దు. ఇన్విటేష‌న్ పంపాడు. బాధ‌తో వెళ్లాల‌ని అనుకోలేదు. ఆ అమ్మాయి ఉద‌య్‌కి సెట్ కాక‌పోవ‌చ్చున‌ని నా మ‌న‌సుకి అనిపించింది. మ‌నం వెళ్ల‌క‌పోతే వాడు గిల్టీగా ఫీల్ అవుతాడేమో అనుకున్నాను. వాడు ఉండుంటే ఇప్పుడు నాకు కాస్త బ‌లంగా ఉండేది.

ఉద‌య్ కిర‌ణ్ ఓ రోజు న‌న్ను క‌ల‌వ‌డానికి ఏడుపు దిగమింగుకుని వ‌చ్చాడు. నా హెయిర్ డ్రెస్స‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అమ్మ‌తో మాట్లాడాలంటూ అడిగాడు. త‌ను వ‌చ్చి నా ద‌గ్గ‌ర ఉద‌య్ వ‌చ్చిన విష‌యం చెప్పాడు. వాడు నా ద‌గ్గ‌ర రావ‌టానికి అడ‌గాలా ఏంట్రా ! ర‌మ్మ‌ను వాడిని.. అన్నాను. నేను ఛెయిర్‌ లో కూర్చుని ఉన్నాను. ప‌క్క‌నే చ‌ల‌ప‌తి రావుగారున్నారు. రావ‌టం.. రావ‌టం నా కాళ్లు ప‌ట్టుకుని గ‌ట్టిగా ఏడ్చాడు. ఆ ఏడుపుని ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేక‌పోతున్నాను. త‌న‌తో ఏదో జ‌న్మ‌లో అనుబంధం ఉండి ఉంటుందేమో.. అది ఇలా తీర్చేసి త‌ను వెళ్లిపోయాడు.. అని ఎమోషనల్‌గా చెప్పారామె.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now