జబర్ధస్త్ లో మళ్ళీ పచ్చి బూతులు.. ఛండాలమైన మాటలు..

August 19, 2022 2:24 PM

ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి  ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ షోలో బోల్డ్ కంటెంట్ శృతి మించిపోతోంది. దీనికి తోడు జనాలు కూడా ఈ మధ్య బోల్డ్ కంటెంట్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. అది సినిమా అయినా.. షో అయినా.. ఈవెంట్ అయినా..  బూతు పంచ్ లు పడాల్సిందే.

ఈ మధ్యకాలంలో జబర్ధస్త్ నుంచి కంటెస్టెంట్లు  వెళ్లిపోయాక‌.. యూట్యూబ్ ఛానెల్స్ లో జబర్ధస్త్ కమెడియన్లు వరుస ఇంటర్వ్యులు ఇస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షో లో స్కిట్స్ కూడా పెద్దగా పేలడం లేదు. కానీ ఇప్పుడు షో లో కొన్ని మార్పులు చేశారు. కొత్త మెంబర్స్ తో, కొత్త యాంకర్, కొత్త జడ్జిలతో షో కి నూతన కళ వచ్చింది. ఈ క్రమంలోనే షోకి ఎలాగైనా ఆదరణ తెచ్చేందుకు టీం లీడర్స్ డబుల్ మీనింగ్ కామెడీని పండించడానికి ప్రయత్నిస్తున్నారు.

jabardasth august 11th 2022 promo netizen comments

ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ స్కిట్ లో తాగుబోతు రమేష్ కామెడీ టైమింగ్ కొంచెం హద్దులు దాటేసిన‌ట్లు కనిపిస్తోంది. స్కిట్ లో భాగంగా రమేష్.. తన భార్యతో హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అందుకేనా హ్యాపీ మూడ్ అని స్టేటస్.. అంటాడు. దీంతో భార్య డ్రీమ్స్‌ లో ఉంటుంది. అప్పుడే హనీ మూన్ లో ఏం చేస్తారు అని అడగ్గా.. మూన్ చూస్తూ, హనీ ని నాకుతారు అంటాడు.

అప్పుడే లేడీ కమెడియన్ నాకడానికి అంత దూరం వెళ్లాలా అంటూ పచ్చి బూతు పదాలను పంచ్ గా వాడింది. దీనికి అర్ధం అందరికీ తెలిసినా.. జబర్ధస్త్ అంటే ఇలాంటి మాటలు కామనే అంటూ సైలెంట్ గా నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now