మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో తెలుసా?

June 8, 2021 10:09 PM

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం స్త్రీలు పట్టీలు ధరించడం ఒక ఆచారంగా వస్తుంది. పాప పుట్టగానే తన కాళ్లకు పట్టీలు తొడగడం ఆనవాయితీ.ఈ విధంగా చిన్నారి కాళ్లకు వెండి పట్టీలను ధరించి ఘల్లుఘల్లున మన ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నడుస్తోందని భావిస్తారు. అదేవిధంగా పెళ్లి తర్వాత అమ్మాయిలకు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామంది కాళ్లకు వెండి పట్టీలను మాత్రమే ధరిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరికి బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదు అనే సందేహం కలుగుతుంది. అయితే బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తాము. అందుకోసమే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు రంగులోనే బంగారం ఉంటుంది కనుక బంగారు పట్టీలను మన పాదాలకు తొడగితే సాక్షాత్తు లక్ష్మీదేవిని అవమాన పరిచినట్లు. కనుక బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగకూడదని పండితులు చెబుతున్నారు.

సైన్స్ పరంగా మన శరీరానికి బలం పాదాల నుంచి పైకి ఎగబాకుతుంది కనుక పాదాలకు వెండి పట్టీలను తొడగడం ద్వారా మన శరీరంలో ఉన్న వేడి తగ్గిపోయి శరీరానికి చల్లదనం కల్పిస్తుంది. కానీ బంగారానికి వేడి గుణం ఉండటం వల్ల బంగారం ధరించడం వల్ల మన శరీరం వేడి చేస్తుంది.అందుకోసమే కాళ్లకు వెండి పట్టీలనే తొడగాలనీ చెబుతారు. ఇటు ఆధ్యాత్మికంగాను,ఆరోగ్య పరంగాను వెండి పట్టీలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకోసమే బంగారు పట్టీలను స్త్రీలు పాదాలకు తొడగరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now