త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కీర్తి సురేష్..? వరుడు ఎవరంటే..?

August 19, 2022 2:21 PM

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవల కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి సర్కారు వారి పాటతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ ఫిల్మ్ కెరీర్‌ గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతోందని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదికూడా తల్లిదండ్రులు నిశ్చయించిన వ్యక్తితోనే వివాహం జరగబోతోందని అంటున్నారు. అతను ఓ వ్యాపారవేత్తని, రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటాడని టాక్‌ వినిపిస్తోంది. హీరోయిన్ల విషయంలో ఇలాంటి గాసిప్స్‌ రావడం సహజమే. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ ఇంకా స్పందించలేదు.

keerthy suresh marriage news viral in social media

ఇక‌ సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ మూడు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో జంటగా మామన్నన్‌ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో నాచురల్ స్టార్‌ నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్‌ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. కెరీర్‌ మంచి స్వింగ్‌లో ఉండగా కీర్తి పెళ్లికి అంగీకరించిందంటే నమ్మశక్యంగా లేదని అంటున్నారు. మ‌రి దీనిపై ఆమె ఏమైనా స్పందిస్తుందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now