సండే స్పెషల్: స్పైసీ చికెన్ ఉల్లికారం ఫ్రై తయారీ విధానం

June 12, 2021 8:46 PM

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ ఒకే విధమైన పద్ధతిలో చికెన్ తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే కొంచెం వెరైటీగా టేస్టీగా స్పైసీ ఉల్లి పాయ చికెన్ ఫ్రై ట్రై చేద్దాం.. మరి ఈ స్పైసీ ఉల్లిపాయ చికెన్ ఏ విధంగా తయారు చేయాలి ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*అరకిలో చికెన్

* పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి

*ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు

*రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు

*టేబుల్ స్పూన్ జీలకర్ర

*ఎండుమిర్చి7

*వెల్లుల్లి రెబ్బలు

*నిమ్మకాయ

*ఉప్పు తగినంత

*కొత్తిమీర తురుము

*పచ్చిమిర్చి 2

*నూనె రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయ స్టవ్ పై అతి తక్కువ మంటలో కాల్చుకోవాలి. ఉల్లిపాయ బాగా కాలిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ కాల్చి చేయడం వల్ల చికెన్ ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని కాల్చిన ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీటిని ఉపయోగించి ఈ మిశ్రమం బాగా మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక గిన్నెలో చికెన్ తీసుకుని నిమ్మకాయ రసం పిండి అందులోకి తగినంత ఉప్పు వేయాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ కారం మొత్తం చికెన్ లో వేసి ముక్కలకు అంటుకునే విధంగా కలపాలి. ఈ విధంగా మిశ్రమం మొత్తం కలిపి వీలైనంత వరకు ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఒక గంట తర్వాత స్టౌ పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. తరువాత ఈ మిశ్రమంలోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసి బాగా కలియబెట్టాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకొని మూతపెట్టి ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. ఈ మధ్యలో అప్పుడప్పుడు చికెన్ కలుపుతూ ఉడికించాలి. ఈ విధంగా చికెన్ మొత్తం మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర తురుము చల్లుకోవడంతో ఎంతో స్పైసీ చికెన్ ఉల్లికారం తయారైనట్టే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now