నిత్య మీన‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 6 ఏళ్ల పాటు వేధింపుల‌కు గుర‌య్యా అని ఆవేద‌న‌..

August 8, 2022 8:02 AM

అలా మొదలైంది చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్యామీనన్. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన క్యారెక్టర్ కు గుర్తింపు ఉండే చిత్రాలను ఎంచుకుంటూ నిత్యామీనన్ నటనపరంగా మంచి పేరును సంపాదించుకుంది. ఇటీవల కాలంలో నిత్యామీనన్ కు సినిమా ఆఫర్లు తగ్గాయ‌నే చెప్పవచ్చు. తాజాగా నిత్యా మీనన్ నిర్మాతగా బాధ్యతల‌ను చేపట్టారు. ఈ ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తిరుచిత్రాంబలం మూవీ.

ఈ చిత్రంలో హీరో ధనుష్ కి జంటగా నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ విషయాలన్నీ ఇలా ఉండగా,  ఓ సందర్భంలో తను కూడా వేధింపులకు గురయ్యాను అని తెలియజేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం లాంటిది. ఈ రంగుల ప్రపంచం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అందులో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఫిమేల్ సినీ ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

nithya menen sensational comments about her recent life

వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకని, తమ సమస్యలను బయటకు  చెప్పకుండా లోపలే అణచివేసుకొనేవారు ఎంతో మంది ఉన్నారు.  క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అనేక మంది ఫిమేల్ ఆర్టిస్టులు ఎదుర్కొన్న సమస్యలు ఎప్పటి నుంచో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టులే కాదు స్టార్ హీరోయిన్స్ కూడా అనేక సమస్యలతో ఇండస్ట్రీలో  సతమతమవుతున్నారు. నేను కూడా ఈ కోవకు చెందిన మహిళలలో ఒకదాన్ని.. అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు నిత్యామీనన్.

కొంత కాలంగా సోషల్ మీడియాలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యామీనన్ అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. ఆరేళ్లుగా నన్ను ఒక సమస్య వేధిస్తోంది. సంతోష్ వర్గీస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ  తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. గత ఆరేళ్ల నుంచి నన్ను అన్ పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటూ తన సమస్యపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్య పట్ల నా తల్లిదండ్రులు నాకు అండగా నిలవడంతో అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. సంతోష్ తో నా వివాహం అనే ప్రచారంలో వాస్తవం లేదని ఆవేదన వ్యక్తంచేశారు నిత్యామీనన్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment