అస‌లైన మెగాస్టార్ క‌ల్యాణ్ రామ్‌.. నంద‌మూరి అభిమానుల పోస్టులు వైర‌ల్‌..

August 7, 2022 3:37 PM

ఈ మ‌ధ్య కాలంలో ఏదైనా అగ్ర‌ హీరో మూవీ విడుద‌ల అవ్వ‌గానే, ఆ హీరో ఇంకా ఇత‌ర అగ్ర‌ హీరోల అభిమానుల మ‌ధ్య మాట‌ల యుద్ధాల‌ను త‌ర‌చూ మ‌నం చూస్తూనే ఉన్నాం. సోష‌ల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్స్ కూడా సాధార‌ణం అయిపోతున్నాయి. ఒక హీరో అభిమానులు ఇంకో హీరోని తిట్ట‌డం, హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించ‌డం మామూలు విష‌యంలా అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ అభిమానం బింబిసార మూవీకి త‌ల నొప్పిగా మారింద‌ని తెలుస్తోంది.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో దాదాపు 2 సంవ‌త్స‌రాల విరామం త‌రువాత విడుద‌లైన సినిమా బింబిసార. విడుద‌లైన రోజు నుంచే మంచి హిట్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తోంది. నంద‌మూరి అభిమానులు బింబిసార మూవీని ఇటీవ‌ల చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమాతో పోలుస్తూ.. చిరంజీవి అస‌లైన మెగాస్టార్ కాద‌ని, క‌ళ్యాణ్ రామే అస‌లైన మెగాస్టార్ అని ఆయ‌నని ఆకాశ‌నికి ఎత్తేస్తున్నారు. ఇది ఇప్పుడు మెగాస్టార్ అభిమానుల‌కి, ఇత‌ర మూవీ ల‌వ‌ర్స్ కి కోపం తెప్పించేలా ఉంది.

nandamuri fans say kalyan ram is the real mega star

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ లో చిరంజీవి ఎంత పెద్ద స్టార్ అనేది అంద‌రికీ తెలుసు. ఆయ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు. ఇది కాద‌న‌లేని నిజం. సాధార‌ణంగా మంచి సినిమాని ఇత‌ర హీరోల అభిమానులు కూడా ఆద‌రిస్తారు. కానీ నంద‌మూరి అభిమానులు ఇప్పుడు చేస్తున్న ప‌నివ‌ల్ల‌ ఈ మూవీకి నెగెటివ్ ప‌బ్లిసిటీని తెచ్చిపెట్ట‌డంతోపాటు.. ఇత‌ర సినీ ప్రియుల‌ని ఎక్క‌డ థియేట‌ర్ల‌కి రాకుండా చేస్తుందోన‌ని.. నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అయితే
సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ మ‌ధ్య ఈ వార్ మామూలే. దీని ఫలితం బింబిసార మూవీపై ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now