Samantha : అదిరిపోయే అప్‌డేట్‌.. పుష్ప 2 లో స‌మంత‌..?

August 4, 2022 6:26 PM

Samantha : టాలీవుడ్ డైన‌మిక్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఇక వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉన్న స‌మంత‌కు మ‌రో భారీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈమెకు పుష్ప 2లో న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని స‌మాచారం. పుష్ప మొద‌టి పార్ట్‌లో ఈమె ఊ అంటావా పాట చేసి అల‌రించింది. అయితే రెండో పార్ట్ లో ఈమె ఐట‌మ్ సాంగ్ కాకుండా ఓ పాత్ర‌లో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

పుష్ప 2లో స‌మంత ఐట‌మ్ సాంగ్‌లో కాకుండా ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తుంద‌ని సమాచారం. ఈమె క్యారెక్ట‌ర్‌ను ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశార‌ట‌. పుష్ప 2లో సెకండాఫ్‌లో ర‌ష్మిక పాత్ర శ్రీ‌వ‌ల్లి చ‌నిపోతుంద‌ని.. అయితే ఆమె జ్ఞాప‌కాల నుంచి బ‌య‌ట ప‌డ‌లేని పుష్ప‌కు ఓదార్పుగా స‌మంత పాత్ర వ‌స్తుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమె పాత్ర స్ట్రాంగ్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ వార్త సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చార‌మే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Samantha may act in Pushpa 2 movie
Samantha

ఇక పుష్ప మొద‌టి పార్ట్‌లో ఐట‌మ్ సాంగ్ చేయ‌డం ద్వారా అటు స‌మంత‌కు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇక బాలీవుడ్‌లో న‌టించేందుకు ఈమె ముంబైకి కూడా షిఫ్ట్ అయింది. ఈమె న‌టించిన శాకుంత‌లం, య‌శోద మూవీలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవ‌లే స‌మంత కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో పాల్గొన‌గా.. అందులో త‌న విడాకుల‌పై మాట్లాడేందుకు ఈమె అంగీక‌రించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ త‌మ విడాకులు అంత సామ‌ర‌స్యంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పి అంద‌రినీ షాక్ కు గురిచేసింది. అయితే స‌మంత ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఇందుకు కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment