Jio : జియో మ‌రో సంచ‌ల‌నం..? ఆగ‌స్టు 15వ తేదీన ప్ర‌క‌ట‌న‌..?

August 4, 2022 4:56 PM

Jio : దేశంలోని టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. అప్ప‌ట్లో జియో దెబ్బ‌కు ఇత‌ర టెలికాం కంపెనీలు బొక్క బోర్లా ప‌డ్డాయి. ఒక జీబీ 4జి డేటాకు అప్ప‌టి వ‌ర‌కు కంపెనీలు సుమారుగా రూ.250 వ‌ర‌కు వ‌సూలు చేసేవి. కానీ జియో వ‌చ్చాక ఆ ఖ‌రీదు రూ.10కి ప‌డిపోయింది. అలాగే ఉచిత కాల్స్, యాప్స్‌, జియో టీవీ, న్యూస్‌.. ఇలా అనేక స‌ర్వీసుల‌ను ఒక్క జియో సిమ్‌తో ఉచితంగా పొందే వీలు క‌ల్పించింది. దీంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు జియో వైపుకు మ‌ళ్లారు. అయితే మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌లుచ‌బ‌డుతుంద‌న్న చందంగా ఇప్పుడు జియో మారింది.

జియో సేవ‌లు ఇప్పుడు మ‌రీ అంత ఆక‌ట్టుకునేలా లేవు. నెట్‌వ‌ర్క్ క్వాలిటీ కూడా త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ ఇత‌ర టెలికాం కంపెనీల‌కు పోటీగా నిలుస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త చందాదారుల‌ను చేర్పించుకుంటోంది. అయితే అప్ప‌ట్లో సృష్టించిన సంచ‌ల‌నం మాదిరిగా జియో మ‌రో సంచ‌ల‌నానికి తెర తీయ‌నుందా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఎందుకంటే జియో త్వ‌ర‌లోనే 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌బోతుంది కాబ‌ట్టి.

Reliance Jio may start 5g services on August 15th
Jio

దేశంలో ఇప్ప‌టికే 5జి సేవ‌ల‌కు గాను స్పెక్ట్ర‌మ్ వేలం ముగిసింది. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌తోపాటు జియో కూడా నెట్‌వ‌ర్క్‌ను వేగంగా విస్త‌రిస్తున్నాయి. ప‌లు మొబైల్ త‌యారీ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుని ప‌లు చోట్ల 5జి సేవ‌ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షిస్తున్నాయి. అయితే ఈ విష‌యంలో జియోతోపాటు ఎయిర్‌టెల్ కూడా కాస్త ముందు వ‌రుస‌లోనే ఉంది. ఇక 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ నేప‌థ్యంలో ముకేష్ అంబానీ జియో 5జి సేవ‌ల‌ను ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు వార్త‌లు ఊపందుకున్నాయి.

దేశంలో 5జి స్పెక్ట్ర‌మ్ వేలంలో జియో టాప్ బిడ్డ‌ర్‌గా నిలిచింది. 24,740 మెగా హెడ్జ్ స్పెక్ట్ర‌మ్‌ను జియో రూ.88,078 కోట్ల‌కు ద‌క్కించుకుంది. ఇక దేశంలోని 22 స‌ర్కిళ్ల‌లో జియో తన 5జి సేవ‌ల‌ను అందించ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 15న 5జి సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ద్వారా జియో మ‌రో సంచ‌ల‌నానికి తెర తీయనుంద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ఈసారి జియో మ‌రింత ముందుకు దూసుకుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక జియో త‌రువాత ఎయిర్‌టెల్ 5జి సేవ‌ల‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. మ‌రి ఈ రెండింటిలో ఏ కంపెనీ ముందుగా 5జి సేవ‌ల‌ను అందిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now