Rekha Vedavyas : ఆనందం మూవీ హీరోయిన్‌ రేఖ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

August 4, 2022 8:53 AM

Rekha Vedavyas : శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆకాష్‌ హీరోగా వచ్చిన ఆనందం మూవీ అప్పట్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ అప్పట్లో యూత్‌కు బాగా కనెక్ట్‌ అయింది. ఇక ఈ మూవీ ద్వారా తెలుగు పరిచయం అయిన బ్యూటీ.. రేఖ. ఈమె పూర్తి పేరు రేఖ వేదవ్యాస్‌. ఈమెది కర్ణాటక. కన్నడలో అనేక సినిమాల్లో ఈమె నటించింది. అప్పట్లో ఈమె అనేక మంది యంగ్ హీరోలతో నటించింది. నందమూరి తారకరత్నతో కలిసి ఒకటో నంబర్‌ కుర్రాడులో యాక్ట్‌ చేసింది. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ మూవీలోని పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి.

ఇక ఆనందం తరువాత జాబిలి, ఒకటో నంబర్‌ కుర్రాడు, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్‌ వంటి చిత్రాల్లో రేఖ నటించింది. అయితే నాగార్జున మన్మథుడు మూవీలో ఈమె గెస్ట్‌ రోల్‌లో నటించింది. ఈ క్రమంలోనే ఆయన ఈమెకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారట. కానీ ఆయన నుంచి కాల్‌ రాలేదు. అసలు ఏమైంది.. అన్న విషయం కూడా తెలియదు. కానీ ఈమె అప్పుడప్పుడు ఈ విషయం చెబుతూ విచారిస్తుంటుంది.

Rekha Vedavyas Anandam movie actress see how she is now
Rekha Vedavyas

 

ఇక రేఖ చివరిసారిగా తెలుగులో జీనియస్‌ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించగా.. ఈమె చివరి సినిమా పాదమ్‌ పేసమ్‌. తమిళంలో వచ్చింది. 2014లో తెరకెక్కించారు. అప్పటి నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌ బాస్‌ కన్నడ సీజన్‌లో ఈమె పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్‌ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గానే ఉంటోంది. ఈ బ్యూటీకి ఇప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం కాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment