Jabardasth : జ‌బర్ద‌స్త్‌కు కొత్త యాంక‌ర్ వ‌చ్చేసింది.. అన‌సూయ త‌రువాత రాబోతున్న‌ది ఆమెనే..?

July 31, 2022 5:02 PM

Jabardasth : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మొద‌ట్లో సినిమాల్లోనే న‌టించేది. కానీ త‌రువాత బుల్లితెర‌కు మారింది. ఈక్ర‌మంలోనే ఈమె బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌గా మారింది. త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. అందులోనూ స‌క్సెస్ అయింది. ఇక రంగ‌స్థ‌లం సినిమాలో ఈమె చేసిన రంగ‌మ్మ‌త్త పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. దీంతో ఈమెకు సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

అలా అన‌సూయ సినిమాల‌తోపాటు బుల్లితెర‌పై కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. మ‌రోవైపు వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా మారింది. అయితే ఈమెకు వ‌స్తున్న సినిమా ఆఫ‌ర్ల కార‌ణంగా జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్‌బై చెప్పేసింది. జ‌బ‌ర్ద‌స్త్‌ను వీడుతుంటే చాలా బాధ‌గా ఉందంటూ ఎమోష‌నల్ అయింది. అంతేకాకుండా త‌న కెరీర్‌లో అది చాలా కీల‌క‌మైన నిర్ణ‌య‌మ‌ని.. ఆ త‌రువాత కూడా ప్రేక్ష‌కులు త‌న‌కు స‌పోర్ట్‌గా ఉండాల‌ని కోరింది. ఈ క్ర‌మంలోనే జూలై 28వ తేదీన ప్ర‌సార‌మైన జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ ఆమెకు ఆఖ‌రిది. దీంతో అన‌సూయ త‌రువాత కొత్త యాంక‌ర్‌ను కూడా తెచ్చారు.

anchor Manjusha is the replacement for Anasuya in Jabardasth
Jabardasth

కాగా అనసూయ త‌రువాత వ‌చ్చే యాంక‌ర్‌ను చూపించ‌లేదు. అలా చూపించ‌కుండానే త‌రువాతి జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ ప్రోమోను క‌ట్ చేశారు. కొత్త యాంక‌ర్‌ను చూపించకుండా ప‌ల్ల‌కిలో తెచ్చారు. దీంతో ఆమె ఎవ‌రు.. అనే విష‌యం తెలుసుకునేందుకు టీమ్ లీడ‌ర్స్ ఆస‌క్తిగా చూశారు. అయితే అన‌సూయ స్థానంలో యాంక‌ర్ మంజూష వ‌స్తుంద‌ని ఇదివ‌ర‌కే తెలిసింది. దీంతో ఆమెనే యాంక‌ర్‌గా వ‌చ్చి ఉంటుంద‌ని అంటున్నారు. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌లో అన‌సూయ త‌రువాత వ‌స్తున్న యాంక‌ర్ ఎవ‌రు.. అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ ఎపిసోడ్ ఆగ‌స్టు 4న ప్ర‌సారం కానుంది. మ‌రి కొత్త యాంక‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now