Akira Nandan : అకీరా నంద‌న్ వెళ్లిపోతున్నాడు.. రేణు దేశాయ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

July 30, 2022 10:52 PM

Akira Nandan : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌వర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ కుమారుడు అకీరా నంద‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అకీరా ఇంకా సినిమాల్లోకి రాలేదు. కానీ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నాడు. ఈ మ‌ధ్య‌నే అకీరా బ‌ర్త్ డేను జ‌రుపుకోగా.. ర‌క్త‌దానం చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. దీంతో అందరూ అచ్చం తండ్రిలాగే మంచి గుణం ఉన్న‌వాడంటూ మెచ్చుకున్నారు. ఇక అకీరా నంద‌న్ బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అని చెప్ప‌వ‌చ్చు. చిన్న వ‌య‌స్సు నుంచే అనేక క‌ళ‌ల్లో అత‌ను ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు.

అకీరా నంద‌న్ ఇప్ప‌టికే సంగీతం, హార్స్ రైడింగ్ వంటి క‌ళల్లో ప్రావీణ్య‌త సంపాదించాడు. ఈ క్ర‌మంలోనే త‌న గ్రాడ్యుయేష‌న్ డే సంద‌ర్భంగా.. ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ పియానోపై అద్భుతంగా పాట‌ల‌ను వాయించి ఆశ్చ‌ర్య‌పరిచాడు. అలాగే గుర్రపు స్వారీ కూడా చేయ‌గ‌ల‌డు. తండ్రి ప‌వ‌న్ లా మార్ష‌ల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్య‌త‌ను సంపాదిస్తున్నాడు. అయితే అకీరా నంద‌న్ లో ఉన్న ఇన్న టాలెంట్స్‌ను చూసి అత‌ను సినిమాల్లోకి ఎప్పుడు వ‌స్తాడా.. అని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్న‌త విద్య కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను స్కాట్లండ్‌లోని ఓ యూనివ‌ర్సిటీలో చ‌ద‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Akira Nandan leaving Renu Desai for his higher studies
Akira Nandan

ఇక ఇటీవ‌లే అకీరాతోపాటు రేణు దేశాయ్, ఆద్య కూడా అక్క‌డికి వెళ్లి వ‌చ్చారు. అకీరాను యూనివ‌ర్సిటీలో చేర్పించారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు నుంచి అత‌నికి క్లాసులు ప్రారంభం అవుతాయ‌ని తెలుస్తోంది. అయితే అకీరా ఇక అక్క‌డే ఉండి చ‌దువుకోనుండ‌డంతో రేణు దేశాయ్ అత‌న్ని విడిచి ఉండ‌లేక ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. త‌న చిట్టి ప‌క్షి ఒక‌టి రెక్కలు వ‌చ్చి గూడు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

అకీరా ఇన్ని రోజుల పాటు త‌ల్లి వ‌ద్దే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎక్క‌డో విదేశాల్లో ఒంట‌రిగా గ‌డ‌ప‌బోతున్నాడు. దీంతో అత‌న్ని విడిచి ఉండ‌లేక రేణు ఆ పోస్ట్ పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ విద్యాభ్యాసం 3 ఏళ్ల‌లో ముగియ‌గానే అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now