Allu Arjun : అల్లు అర్జున్ కొత్త లుక్ అదిరిపోయింది.. ఎందుకో తెలుసా..?

July 30, 2022 4:40 PM

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రింగుల జుట్టు.. అక్కడక్కడా తెల్లని కలర్.. చెవికి పోగులు.. నోటిలో సిగార్ తో అల్లు అర్జున్ మోడ్రెన్ లుక్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందిస్తోంది. అయితే అల్లు అర్జున్ ఈ న్యూ లుక్ ఎందుకోసం అంటే.. ఓ యాడ్ కోసమని తెలుస్తోంది. తను చేసేది యాడైనా.. సినిమా.. అయినా ప్రతి విషయంలో చాలా ఫోకస్ గా ఉంటాడు. త్రివిక్రమ్‌ డైరక్షన్ లో ఈ యాడ్ తెరకెక్కుతోంది. యాడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అల్లు అర్జున్ ఈ నయా లుక్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది.

అల్లు అర్జున్ ఈ మేకోవర్ ని చూసి అల్లు ఆర్మీ కొందరు హీరోలని టార్గెట్ చేస్తున్నారు. కొందరు హీరోలు సినిమాల్లో కూడా ఈ మేకోవర్ చూపించరు కానీ మా హీరో ఈ యాడ్ కోసమే కొత్త లుక్ తో వస్తున్నాడని అంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య రచ్చ అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సరికొత్త స్టైలిష్ లుక్ కార‌ణంగా మిగతా హీరోలని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ స్టైలిష్ మేకోవర్ నిజంగానే ఆడియెన్స్ కి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.

Allu Arjun stylish look is going viral in social media
Allu Arjun

ఇక బన్నీ సినిమాల‌ విషయానికి వస్తే.. పుష్ప 2 కోసం ఇంకా లొకేషన్స్ వేట కొనసాగుతూనే ఉంది. మరోపక్క పార్ట్ 1 ఆశించిన స్థాయి కన్నా భారీ హిట్ అవగా పార్ట్ 2 ని ఆ అంచనాలను అందుకునేలా సుకుమార్ కష్టపడుతున్నారు. పుష్ప పార్ట్ 1 తో నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తన మేకోవర్ తో పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now