Narasimha Naidu : రియల్ స్టోరీనే నరసింహ నాయుడు సినిమాగా తీశారా.. బాలయ్య సినిమా గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా..?

July 30, 2022 12:38 PM

Narasimha Naidu : నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరక్టర్ బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నరసింహ నాయుడు. ఆల్రెడీ సమరసింహా రెడ్డి తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరక్టర్ గోపాల్ మరోసారి బాలయ్యతో నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు. 2001 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. అప్పటివరకు బాలకృష్ణ కెరియర్ లోనే కాదు సినీ పరిశ్రమలో ఇదివరకు ఏ సినిమా సృష్టించని రికార్డుల‌ను సృష్టించింది. 104 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.30 కోట్ల దాకా వసూళ్లని రాబట్టింది.

ఇక ఈ సినిమాకు కథని చిన్ని కృష్ణ అందించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. అయితే ఈ సినిమా కథని బీహార్ లో జరిగిన‌ యదార్థ‌ సంఘటనలను ఆధారంగా తీసుకుని రాసినట్టు రైటర్ చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కొందరు రౌడీ మూక గ్రామాలపై దాడి చేస్తుంటే.. వాళ్లని ఎదుర్కునేందుకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానికోసం ఆ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మగ పిల్ల వాడిని ఆ సైన్యానికి అప్పగించేవారట. అప్పగించిన ఆ మగ పిల్లాడిపై ఆశలు వదులుకోవాల్సిందేనట. ఇదే లైన్ తో చిన్ని కృష్ణ నరసింహ నాయుడు కథ రాసుకున్నారు.

Narasimha Naidu movie is based on real story
Narasimha Naidu

సమర్ సింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాల తర్వాత టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ బాగా నడిచింది. ఇలాంటి సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా మారారు. బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తే సూపర్ హిట్టే అన్న టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా బాలకృష్ణ అలాంటి కథలు చేయగా అవి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాల‌ను అందుకోలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now