Pavitra Lokesh : న‌రేష్‌తో వ్య‌వ‌హారం ఎఫెక్ట్‌.. ప‌విత్ర‌కు క‌ల‌సి వ‌చ్చిందిగా.. రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసింద‌ట‌..?

July 30, 2022 11:07 AM

Pavitra Lokesh : ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. కన్నడ నటి అయిన ఈమె ప్రస్తుతం తెలుగులో బిజియెస్ట్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అయ్యింది. వరుస సినిమాలతో ఆమె కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. అయితే ఈమధ్య నరేష్ వ్యవహారంతో ఆమె మరింత వార్తల్లో నిలిచింది. నరేష్ తో పవిత్ర సహజీవనం అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి వేరు వేరుగా దీనిపై వివరణ ఇచ్చుకున్నా ఆ తర్వాత ఇద్దరు ఒకే హోటల్ రూం లో కనబడటం, నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి వీరిపై ఎటాక్ చేయడం తెలిసిందే.

అంతకుముందు పవిత్ర చాలా క్లీన్ ఇమేజ్ తో సినిమాలు చేస్తూ వచ్చారు. నరేష్, పవిత్రల మధ్య ఈ వ్యవహారం ఎప్పటినుంచి ఉందో తెలియదు కానీ వారిద్దరూ కలిసి నటించినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నరేష్, పవిత్రల మ్యాటర్ బయటకు తెలిసిందో, స్క్రీన్ మీద వారు కనిపిస్తున్నప్పుడు ఆడియెన్స్ హడావిడి చేయడం మొదలు పెట్టారు. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవిత్ర లోకేష్ కనబడగానే థియేటర్ లో సందడి మొదలైంది. ఇక ఆమె నరేష్ తో కనిపించే సరికి కేకలు వేశారు. ఈ వ్యవహారం ఆమె కెరియర్ కు మైనస్ అవుతుందని అనుకుంటే ఆడియెన్స్ నుంచి ఈ రియాక్షన్ అసలు ఊహించలేదనే చెప్పొచ్చు.

Pavitra Lokesh reportedly increased her remuneration
Pavitra Lokesh

అంతేకాదు అంతకుముందు రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోని పవిత్ర ఇప్పుడు తన రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు తెలుస్తోంది. నరేష్ కూడా పవిత్ర కోసం రికమెండేషన్ చేస్తున్నారట. అయితే పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్ మాత్రం ఆమె డబ్బు మనిషని.. నరేష్ ని కూడా కొన్నాళ్లకు వదిలేస్తుందని అన్నారు. ఎవరు ఎలా అనుకున్నా సరే తమని ఎవరూ ఆపలేరు అన్నట్టుగా.. నరేష్, పవిత్రల వ్యవహారం ఉంది. మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now