---Advertisement---

Balakrishna : జై బాల‌య్య‌.. అభిమానిని స్వ‌యంగా పిలిపించుకుని క‌లిసి భోజ‌నం చేశారు..!

July 26, 2022 10:14 AM
---Advertisement---

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ పేరు చెప్ప‌గానే మ‌న‌కు ఆయ‌న ఆగ్ర‌హంగా మాట్లాడిన మాట‌లు గుర్తుకు వ‌స్తాయి. కానీ వాస్త‌వానికి ఆయ‌న బ‌య‌ట‌కు ఎంతో క‌ఠినంగా క‌నిపించిన‌ప్ప‌టికీ అభిమానులు అంటే ఆయ‌న‌కు ఎంతో ప్రేమ‌. కాక‌పోతే ఆయ‌న‌తో ఉన్న‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా ప్ర‌వ‌ర్తించాలి. ఆయ‌న‌కు విసుగు తెప్పించ‌కూడ‌దు. అలా చేస్తే వెంట‌నే చెంప చెళ్లుమ‌నిపిస్తారు. సాధార‌ణంగా జాగ్ర‌త్త‌గా న‌డుచుకుంటే బాల‌య్య త‌న అభిమానుల‌తో ఎంతో సేపు గ‌డుపుతారు. ఇక అలాంటిదే ఒక సంఘ‌ట‌న తాజాగా చోటు చేసుకుంది.

బాల‌కృష్ణ‌, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎన్‌బీకే 107 వ‌ర్కింట్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న మూవీ షూటింగ్‌ను ప్ర‌స్తుతం కర్నూల్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ మూవీకి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. కాగా బాల‌య్య తాను బ‌స చేస్తున్న హోట‌ల్‌లో ఉన్నప్పుడు ఒక అభిమానిని స్వ‌యంగా త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకున్నారు. గ‌తంలో ఆయ‌న ఆ అభిమానికి మాట ఇచ్చారు. దీంతో దాన్ని బాల‌య్య గుర్తు పెట్టుకుని మ‌రీ ఆ అభిమానికి ఫోన్ చేశారు. కుటుంంబంతో స‌హా త‌న ద‌గ్గ‌ర‌కు రావాల‌ని చెప్పారు. దీంతో ఆ అభిమాని అలాగే వ‌చ్చాడు. ఈ క్ర‌మంలోనే అత‌ని కుటుంబంతో క‌లిసి బాల‌య్య భోజ‌నం చేశారు. ఇక ఆ అభిమాని ఎవ‌రో కాదు.. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాద్ హుస్సేన్‌.

Balakrishna called his fan and took lunch with him
Balakrishna

అలా సజ్జాద్ హుస్సేన్ కుటుంబంతో క‌లిసి భోజ‌నం చేసిన త‌రువాత బాల‌య్య అత‌ని కుమారున్ని ఎత్తుకుని ఆడించారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో బాల‌య్య గొప్ప‌త‌నాన్ని చూసి ఆయ‌న అభిమానులు మురిసిపోతున్నారు. బాల‌య్య‌కు అభిమానులు అంటే ఎంత ప్రేమో క‌దా.. అని.. జై బాల‌య్య అంటూ.. ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. ఇక కొద్ది రోజులుగా క‌ర్నూల్‌లోనే షూటింగ్ చేస్తున్న బాల‌య్య‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వ‌స్తున్నారు. ఆయ‌న వారంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now