SBI : ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఏటీఎంల‌లో నుంచి డ‌బ్బును విత్‌డ్రా చేస్తున్నారా ? అయితే మారిన ఈ రూల్‌ను తెలుసుకోండి..!

July 25, 2022 10:45 PM

SBI : దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ వినియోగ‌దారుల‌కు ఆ బ్యాంక్ ఓ ముఖ్య‌మైన స‌మాచారాన్ని తెలియజేసింది. ఇక‌పై ఆ బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు ఏటీఎంల‌లో నుంచి డ‌బ్బుల‌ను విత్‌డ్రా చేయాలంటే త‌ప్ప‌క ఓటీపీతో వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఏటీఎంల‌లో మోసాలు పెరుగుతున్నందునే ఈ త‌ర‌హా ప‌ద్ధ‌తిని అమ‌లు చేస్తున్న‌ట్లు ఎస్‌బీఐ తెలియ‌జేసింది. కాగా రూ.10వేలు అంత‌క‌న్నా మించిన న‌గ‌దును విత్‌డ్రా చేస్తేనే ఓటీపీని ఎంట‌ర్ చేయాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడు ఎంత మొత్తాన్ని విత్‌డ్రా చేసినా స‌రే త‌ప్ప‌క ఓటీపీని ఎంట‌ర్ చేయాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు కావల్సిన మొత్తాన్ని ఏటీఎంలో ఎంటార్ చేశాక‌.. పిన్ నంబ‌ర్‌తో క‌న్‌ఫామ్ చేయాలి. త‌రువాత మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేస్తేనే ఇక‌పై డ‌బ్బును విత్‌డ్రా చేయ‌గ‌లుగుతారు. ఈ విష‌యాన్ని ఎస్‌బీఐ తాజాగా వెల్లడించింది. ఇక ఎస్‌బీఐకి చెందిన ఏటీఎం సేవ‌ల‌ను వాడుకోవాలంటే గ‌తంలో అప‌రిమిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు వాటిపై ప‌రిమితుల‌ను విధించారు. దీని వ‌ల్ల ఏటీఎంల‌లోంచి అధిక సార్లు డ‌బ్బును విత్‌డ్రా చేస్తామంటే కుద‌ర‌దు. అందుకు చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది.

SBI customers must know this rule before withdrawing money
SBI

ఇక అకౌంట్‌లో నెల‌వారీగా రూ.1 ల‌క్ష అంత‌క‌న్నా ఎక్కువ మొత్తాన్ని మెయింటెయిన్ చేసేవారు మెట్రో న‌గ‌రాల్లో ఉంటే వారు ఎస్‌బీఐ ఏటీఎంల‌లో నుంచి నెల‌కు 5 సార్లు ఉచితంగా డ‌బ్బును విత్‌డ్రా చేయ‌వ‌చ్చు. అదే ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌ను వాడితే 3 లావాదేవీల‌ను మాత్ర‌మే ఉచితంగా అందిస్తారు. ఇక ప‌రిమితికి మించిన త‌రువాత ఒక్కో ఏటీఎం లావాదేవీకి రూ.10 వ‌ర‌కు చార్జి చేస్తారు. అదే ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల‌లో అయితే రూ.20 చార్జి చేస్తారు. ఇక డ‌బ్బు విత్‌డ్రా కాకుండా ఇత‌ర లావాదేవీలు అయితే ఎస్‌బీఐ ఏటీఎంల‌లో ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌రిమితి మించి లావాదేవీల‌కు గాను ఒక్కోదానికి రూ.5 వ‌సూలు చేస్తారు. అదే ఇత‌ర ఏటీఎంల‌ను ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు వాడితే ప‌రిమితికి మించితే.. ఒక్కో ఇత‌ర లావాదేవీకి రూ.8 వ‌ర‌కు వ‌సూలు చేస్తారు. ఇలా ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు చార్జిల‌ను దృష్టిలో పెట్టుకుని ఏటీఎంల‌లో నుంచి డ‌బ్బును విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. లేదంటే చార్జిల‌ను చెల్లించ‌క త‌ప్ప‌దు.

sbi

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment