Nagarjuna : తండ్రీ కొడుకుల‌ మ‌ధ్య విభేదాలు..? నాగార్జున‌కు దూర‌మైన నాగ‌చైత‌న్య‌..?

July 24, 2022 12:37 PM

Nagarjuna : నాగ‌చైత‌న్య, రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో లేటెస్ట్‌గా రిలీజ్ అయిన మూవీ.. థాంక్ యూ. రూ.20 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు త‌న శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. జూలై 22న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి రోజు రూ.2.50 కోట్ల మేర నెట్ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అయితే బ్రేక్ ఈవెన్‌కు ఇంకా రూ.22.50 కోట్లు రావాల‌ని అంటున్నారు. కానీ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. అనేక చోట్ల వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనికి తోడు ఓటీటీల ప్ర‌భావ‌మూ ఎక్కువ‌గానే ఉంది. క‌నుక థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావాలంటేనే వెనుక‌డుగు వేస్తున్నారు. నాలుగు రోజులు పోతే ఓటీటీల్లో చూడ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారు. అందువ‌ల్లే పాజిటివ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ థాంక్ యూ మూవీకి మాత్రం క‌లెక్ష‌న్లు పెద్ద‌గా రావ‌డం లేదు. దీంతో మూవీ ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంటుంద‌ని అంటున్నారు.

అయితే థాంక్ యూ మూవీ ఏమోగానీ సోష‌ల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ వైర‌ల్ అవుతోంది. నాగ‌చైత‌న్య‌, నాగార్జునల‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని అంటున్నారు. అందువ‌ల్లే చైతూ వారికి దూరంగా ఉంటున్నాడ‌ట‌. ఇక థాంక్ యూ మూవీ ఫంక్ష‌న్‌కు నాగార్జున వస్తార‌ని దిల్ రాజు చెప్పారు. కానీ అది జ‌ర‌గలేదు. అలాగే థాంక్ యూ గురించి అక్కినేని ఫ్యామిలీ ఎక్క‌డా ప్ర‌మోష‌న్ చేయ‌డం లేదు. నాగార్జున క‌నీసం సోష‌ల్ మీడియాలో అయినా పోస్టులు పెట్ట‌లేదు. దీంతో అస‌లు ఏం జ‌రిగి ఉంటుంది ? అని చ‌ర్చించుకుంటున్నారు.

Nagarjuna and Naga Chaitanya not in good terms
Nagarjuna

తండ్రీ కొడుకుల‌కు మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని.. క‌నుక‌నే నాగార్జున‌.. నాగ‌చైత‌న్య‌కు దూరంగా ఉంటున్నార‌ని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉందో తెలియ‌దు కానీ.. థాంక్ యూ మూవీని నాగార్జున ప్ర‌మోట్ చేయ‌క‌పోవ‌డంతో.. ఆ వార్త‌కు బ‌లం చేకూరిన‌ట్లు అయింది. ఇక నాగార్జున హోస్ట్‌గా త్వ‌ర‌లో బిగ్ బాస్ షో సీజ‌న్ 6 ప్రారంభం కానుండ‌గా.. ఆయ‌న న‌టించిన ఘోస్ట్ మూవీ ద‌స‌రాకు విడుద‌ల కానుంది. అలాగే చైత‌న్య న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా అనే హిందీ మూవీ ఆగ‌స్టులో రిలీజ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now