Nayanthara : న‌య‌న‌తార‌, విగ్నేష్ దంప‌తుల పెళ్లి వీడియో.. ఓటీటీలో.. ఎందులో అంటే..?

July 21, 2022 7:53 PM

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌లు జూన్ 9న మ‌హాబ‌లేశ్వ‌రంలో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఒక్క‌ట‌య్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్‌, కోలీవుడ్ నుంచి అనేక మంది సినీ ప్ర‌ముఖులు వ‌చ్చారు. ర‌జ‌నీకాంత్‌, షారూఖ్ ఖాన్ లు హాజ‌ర‌య్యారు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో హ‌క్కుల‌ను రూ.25 కోట్ల‌కు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య ఓ వివాదం త‌లెత్తిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

న‌య‌న‌తార‌, విగ్నేష్ దంప‌తులు త‌మ పెళ్లి ఫొటోల‌ను నెల రోజులు కూడా కాక‌ముందే డీల్‌కు విరుద్ధంగా సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశార‌ని.. క‌నుక వారి పెళ్లి వీడియోకు గాను ముందుగా అనుకున్న మొత్తం కంటే త‌క్కువ మొత్తాన్ని అందిస్తామ‌ని నెట్‌ఫ్లిక్స్ వారికి షాకిచ్చింద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. అయితే వీటిని న‌య‌న‌తార టీమ్ కొట్టి పారేసింది. అలాంటిదేమీ లేద‌ని.. వ‌ట్టి పుకార్లేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇక నెట్ ఫ్లిక్స్‌లో వీరి పెళ్లి వీడియో ప్ర‌సారం కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యాన్ని తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించారు.

Nayanthara and Vignesh Shivan marriage video on OTT
Nayanthara

అయితే న‌య‌న్‌, విగ్నేష్‌ల పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్‌లో ఎప్పుడు ప్ర‌సారం అవుతుందో తెలియ‌దు. కానీ త్వ‌ర‌లోనే ఆ వీడియోను వారు స్ట్రీమ్ చేస్తార‌ని స‌మాచారం. ఇక పెళ్లి అనంత‌రం ఈ దంప‌తులు బ్యాంకాక్‌కు హ‌నీమూన్‌కు వెళ్లి వ‌చ్చారు. త‌రువాత న‌య‌న‌తార య‌థావిధిగా షూటింగ్‌ల‌లో పాల్గొంటోంది. ఈమె ప్ర‌స్తుతం షారూఖ్ ఖాన్ ప‌క్క‌న జ‌వాన్ అనే మూవీలో న‌టిస్తోంది. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ డైరెక్ష‌న్ చేస్తున్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాదిలో విడుద‌ల అవుతుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now