Upasana : ఉపాస‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. చ‌ర‌ణ్ ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌..

July 20, 2022 1:26 PM

Upasana : మెగా కోడ‌లిగా, కామినేని ఇంటి ఆడ‌ప‌డుచుగా ఎంతో పేరు తెచ్చుకున్న కొణిదెల ఉప‌సాన గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె జూలై 20వ తేదీన త‌న 33వ పుట్టిన రోజును జ‌రుపుకుంటున్నారు. 1989, జూలై 20వ తేదీన ఈమె జ‌న్మించారు. తండ్రి అనిల్ కామినేని కాగా త‌ల్లి శోభ‌నా కామినేని. ఈ క్ర‌మంలోనే నేడు మెగా కాంపౌండ్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ మ‌ధ్యే చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌మ వివాహం అయి 10 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్నారు. ఇక ప్ర‌స్తుతం ఉపాస‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగా కుటుంబ సభ్యుల‌తోపాటు సినీ ప్ర‌ముఖులు, మెగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఉపాస‌న ప్ర‌స్తుతం ఓ వైపు చ‌ర‌ణ్ వ్యాపారాల‌ను చూసుకుంటూనే.. మ‌రోవైపు అపోలో హెల్త్ కేర్ బాధ్య‌త‌ల‌ను కూడా చేప‌డుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లోనూ ఈమె విరివిగా పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే 200కు పైగా అనాథ‌, వృద్ధాశ్ర‌మాల‌ను దత్త‌త తీసుకుని వారి సంక్షేమం చూస్తున్నారు. దీంతోపాటు నెహ్రూ జూ పార్క్‌లో ప‌లు వన్య‌ప్రాణుల‌ను కూడా ఈమె ద‌త్త‌త తీసుకుని వాటిని సంర‌క్షిస్తున్నారు. ఇక ఉపాస‌న‌, చ‌ర‌ణ్ దంప‌తులు ఈమ‌ధ్యే త‌మ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా యూర‌ప్ టూర్ వేయ‌గా.. అక్క‌డ తీసుకున్న ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అలాగే చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్‌, ఆచార్య మూవీ ఫ‌స్ట్ షోల‌కు ఉపాస‌న హాజ‌రై చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ల స‌మ‌యంలో గాల్లోకి పేప‌ర్ల‌ను చింపి విసిరి సంద‌డి చేశారు.

birthday wishes pouring for Upasana
Upasana

కాగా ఉపాస‌న ప్ర‌స్తుతం వ్యాపారాల‌కే ప‌రిమితం కాగా.. త్వ‌ర‌లోనే సినిమా రంగంలోకి కూడా అడుగు పెట్టబోతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌రలోనే ఈమె సినిమాల‌ను నిర్మించ‌నున్నార‌ట‌. ఇక ఉపాస‌న పుట్టిన రోజు అంటే అది మెగా కుటుంబంలో ఒక వేడుక అనే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే నేటి సాయంత్రం మెగా ఇంట్లో ఓ ఫంక్ష‌న్ నిర్వ‌హిస్తున్నార‌ట‌. దీనికి ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు కూడా హాజ‌ర‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ త‌న శ్రీ‌మ‌తికి ఓ ప్ర‌త్యేక‌మైన గిఫ్ట్‌ను కూడా ఇవ్వ‌నున్నాడ‌ని తెలుస్తోంది. అయితే చ‌ర‌ణ్ ఆమెకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వ‌నున్నారు.. అనే విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి ఆ విష‌యం తెలియాలంటే ఇంకొక రోజు వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now