Krithi Shetty : బేబ‌మ్మ కెరీర్‌లో మొద‌టి ఫ్లాప్‌.. ఎక్క‌డ తేడా కొట్టింది..?

July 20, 2022 7:48 AM

Krithi Shetty : గ‌తేడాదిలో స‌క్సెస్ సాధించిన హీరోయిన్లు ఎవ‌రైనా ఉన్నారా.. అంటే అది కృతి శెట్టి ఒక్క‌రే అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈమె తెలుగులో న‌టించింది మూడే మూడు సినిమాలు. అవి కూడా వ‌రుస‌గా హిట్‌. తొలి మూడు సినిమాలు విజ‌యం సాధించ‌డంతో స‌హ‌జంగానే ఈమెకు అవ‌కాశాలు పెరిగాయి. దీంతో వ‌రుస ప్రాజెక్టుల‌తో దూసుకుపోతోంది. అయితే ఎంత‌టి వారికైనా స‌క్సెస్ అన్న‌ది అన్ని సార్లు రాదు. అప్పుడ‌ప్పుడు ఫెయిల్యూర్స్ కూడా ఎదుర‌వుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కృతిశెట్టికి కూడా మొద‌టి ఫెయిల్యూర్ వ‌చ్చింది. రామ్‌తో క‌ల‌సి న‌టించిన ది వారియ‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచింది. ఈ మూవీ మండే టెస్ట్‌లో పాస్ కాలేదు. దీంతో సినిమా ఫ్లాప్ అయిన‌ట్లు అర్థం చేసుకోవాలి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ద్వారా కృతిశెట్టి తొలి ఫ్లాప్‌ను అందుకున్న‌ట్లు అయింది.

వాస్త‌వానికి ఇందులో కృతి త‌ప్పేమీ లేదు. అందివ‌చ్చిన అవ‌కాశం, కాదంటే ఒక వేళ సినిమా హిట్ అయితే అప్పుడు సినిమా చేయ‌లేక‌పోయామే బాధ ఉండ‌కూడ‌ద‌నే.. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా చేస్తోంది. అయితే చేసిన ప్ర‌తి సినిమా హిట్ కావాల‌ని చెప్ప‌లేం. కొంద‌రు స్టార్స్‌కు వ‌రుస‌గా హిట్స్ ప‌డ‌తాయి. త‌రువాత ఫ్లాప్ లు వెంటాడుతాయి. స‌క్సెస్ అన్న‌ది సినిమా ఇండ‌స్ట్రీలో చాలా అరుదుగా వ‌స్తుంటుంది. కానీ కృతిశెట్టికి అది తొలి మూడు సినిమాల రూపంలో వ‌చ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ది వారియ‌ర్ మూవీతో తొలి ఫ్లాప్‌ను అందుకుంది.

Krithi Shetty recieved first flop in her career
Krithi Shetty

ఇక కృతిశెట్టికి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. ఎందుకంటే ఆమె చేతిలో ఇంకో నాలుగు సినిమాలు ఉన్నాయి. నితిన్‌తో క‌ల‌సి మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం చేస్తోంది. ఈ మూవీ ఆగ‌స్టు 12న రిలీజ్ అవుతుంది. అలాగే ఇంద్ర‌గంటి తీస్తున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌తో మూవీ క‌న్‌ఫామ్ అయింది. అలాగే త‌మిళ స్టార్ న‌టుడు సూర్య‌తో అచ‌లుడు చేయ‌నుంది. క‌నుక కృతిశెట్టి కెరీర్‌కు ఇప్ప‌టికిప్పుడు జ‌రిగే న‌ష్టం ఏమీ ఉండ‌దు. కానీ ఈమె సినిమా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవాలంటే.. చేస్తున్న ఈ నాలుగు సినిమాల్లో క‌నీసం 2 హిట్స్ అయినా ప‌డాలి. అప్పుడే స్టార్ హీరోయిన్‌గా మారేందుకు అవ‌కాశాలు ఉంటాయి. మ‌రి ఈమె భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now