Naga Chaitanya : ఆమె నా హృద‌యాన్ని ముక్క‌లు చేసింది: నాగ చైత‌న్య

July 19, 2022 3:23 PM

Naga Chaitanya : అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ.. థాంక్ యూ. దీనికి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలో రాశి ఖ‌న్నాతోపాటు అవికాగోర్‌, మాళ‌వికా నాయ‌ర్‌లు ఇత‌ర హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీ జూలై 22వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై అభిమానుల్లో అంచ‌నాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది.

థాంక్ యూ చిత్రానికి గాను నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా వేగంగా ప్ర‌మోష‌న్స్ చేప‌డుతున్నారు. ప‌లు చానల్స్‌కు వీరు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ ఇద్ద‌రూ ప‌లు విష‌యాల‌ను షేర్ చేశారు. రాశి ఖ‌న్నాకు థ్యాంక్స్ చెప్పేందుకు ఒక ఇంట‌ర్వ్యూ స‌రిపోద‌ని, వెబ్ సిరీస్ తీయాల‌ని.. అది 8 పార్ట్‌లు అవుతుంద‌ని తెలిపాడు. ఇక రాశి ఖ‌న్నా కూడా తాను చైతూకు అనేక విష‌యాల్లో థ్యాంక్స్ చెప్పాల‌ని తెలియ‌జేసింది.

Naga Chaitanya interesting comment in Thank You promotions
Naga Chaitanya

ఈ మూవీ క‌థ విన‌గానే త‌న‌లో ఏదో తెలియ‌ని ఫీలింగ్ వ‌చ్చింద‌ని చైతూ తెలిపాడు. త‌న జీవితంలోని స్పెష‌ల్ వ్య‌క్తుల‌కు థ్యాంక్స్ చెప్పాల‌ని అనిపించింద‌ని అన్నాడు. అందుక‌నే ఈ మూవీలో న‌టించాన‌ని తెలిపాడు. క‌థ బాగుంద‌ని, అందుక‌నే న‌టించాన‌ని రాశి ఖ‌న్నా తెలియ‌జేసింది. తాను క‌రోనా టైమ్‌లో రోజూ ఫోన్ చెక్ చేసుకునేవాడిన‌ని, సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా కాల‌క్షేపం చేసేవాడిన‌ని, రోజూ లేవ‌డం, తిన‌డం, సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చూసుకోవ‌డం.. ఇదే క‌రోనా లాక్ డౌన్‌లో త‌న డైలీ రొటీన్ అయింద‌ని.. చైతూ తెలిపాడు. అయితే సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెల‌ప‌గా.. రాశి మాట్లాడుతూ.. చైతూ రోజూ కేవ‌లం 4 నిమిషాల పాటు మాత్ర‌మే ఇన్‌స్టాగ్రామ్ చూస్తాడ‌ని తెలిపింది.

రోజూ ర‌ష్యాలో -14 నుంచి -16 డిగ్రీల ఉష్ణోగ్ర‌త వ‌ద్ద గ‌డ్డ క‌ట్టించే చ‌లిలో షూటింగ్ చేసిన‌ట్లు రాశి తెలియ‌జేసింది. ఇక త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి మాట్లాడిన చైతూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలియ‌జేశారు. అప్ప‌ట్లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న రోజుల్లో ముగ్గురం స్నేహితులం ఉండేవాళ్లం. ముగ్గురం ఒకే అమ్మాయిని ల‌వ్ చేశాం. కానీ ఆ అమ్మాయి మా హృద‌యాల‌ను ముక్క‌లు చేసి వెళ్లిపోయింది. త‌రువాతే మేం ఇంకా మంచి స్నేహితులం అయ్యాం.. అని చైతూ తెలిపాడు. కాగా చైతూ చేసిన ఈ కామెంట్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment