Amazon : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌.. టీవీలు, ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు..

July 17, 2022 6:00 PM

Amazon : ప్ర‌ముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 23, 24 తేదీల్లో ప్రైమ్ మెంబ‌ర్ల కోసం ప్ర‌త్యేకంగా ప్రైమ్ డే సేల్‌ను నిర్వ‌హించ‌నున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా అందించ‌నున్న ఆఫ‌ర్లు, డిస్కౌంట్ల వివ‌రాల‌ను అమెజాన్ తెలియ‌జేసింది. ఈ సేల్‌లో అనేక ఉత్ప‌త్తుల‌పై భారీ డిస్కౌంట్ల‌ను, ఆఫ‌ర్ల‌ను అందించ‌నున్నారు. ఆ వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్ ఫోన్ల‌పై 40 శాతం మేర త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు. అలాగే మ‌రో రూ.7వేల వ‌ర‌కు అద‌నంగా ఎక్స్ఛేంజ్ బోన‌స్‌ను పొంద‌వ‌చ్చు. ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల‌పై రూ.20వేల వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. వ‌న్‌ప్ల‌స్‌, షియోమీ, టెక్నో, శాంసంగ్‌, ఐక్యూ, రియ‌ల్‌మి, ఒప్పో, వివో ఫోన్ల‌పై 40 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీంతోపాటు యాక్స‌స‌రీల‌ను 40 శాతం త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొన‌వ‌చ్చు.

Amazon announced offers and discounts in prime day sale
Amazon

ఈ సేల్‌లో హెడ్ సెట్స్ రూ.149 ప్రారంభ ధ‌ర‌ల‌కు ల‌భిస్తుండ‌గా, ప‌వ‌ర్ బ్యాంక్స్ రూ.499, మొబైల్ కేసెస్‌, క‌వర్లు రూ.99, కేబుల్స్ రూ.49, చార్జ‌ర్లు రూ.139, స్క్రీన్ ప్రొటెక్ట‌ర్స్ రూ.99 ప్రారంభ ధ‌ర‌ల‌కు ల‌భ్యం కానున్నాయి. అలాగే ఎల‌క్ట్రానిక్స్ అండ్ యాక్స‌స‌రీస్‌పై 75 శాతం, కెమెరాలు వాటి యాక్స‌స‌రీల‌పై 50 శాతం వ‌ర‌కు, హెడ్ ఫోన్స్‌పై 75 శాతం వ‌ర‌కు త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ప్రింట‌ర్లు, టాబ్లెట్స్‌, గేమింగ్ యాక్స‌స‌రీస్‌, స్పీక‌ర్లు, డేటా స్టోరేజ్ డివైసెస్‌, హైస్పీడ్ రూటర్స్‌, కంప్యూట‌ర్ డివైస్‌లు, సౌండ్ బార్స్‌, మానిట‌ర్లు, టీవీలు, ఏసీ, ఫ్రిజ్‌, వాషింగ్ మెషిన్‌, అమెజాన్ డివైస్‌ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు.

ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, ఎస్‌బీఐ కార్డుల‌తో కొనుగోలు చేస్తే 10 శాతం అద‌నంగా డిస్కౌంట్ ను ఇస్తారు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు అనేక ఇత‌ర ఆఫ‌ర్ల‌ను కూడా ఈ సేల్‌లో అందివ్వ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now