Upasana : పిల్ల‌ల్ని క‌న‌డంపై వైర‌ల్ అయిన వార్త‌లు.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చిన ఉపాస‌న‌..

July 15, 2022 6:50 PM

Upasana : ఈమ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల్లో ఏది నిజ‌మో.. ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌డం లేదు. చాలా మంది ప‌నిగ‌ట్టుకుని మ‌రీ త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తార‌లు.. వారి కుటుంబాల‌కు చెందిన వార్త‌లు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్నాయి. అయితే వీటిల్లో ఫేక్ వార్త‌లే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య కాలంలో రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌ల గురించి కూడా కొన్ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా వారు పిల్ల‌ల్ని క‌నొద్ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. అందుకు కార‌ణం కూడా ఉంద‌ని.. అనేక మాధ్య‌మాల్లో వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. అయితే ఎట్టకేల‌కు ఆ వార్త‌ల‌పై ఉపాస‌న స్పందించింది.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌తో ఉపాస‌న మాట్లాడింది. మీరు పిల్ల‌ల్ని క‌న‌డం లేదంటే అందుకు మిమ్మ‌ల్ని అభినందించ‌వ‌చ్చు.. అని ఆయ‌న అన్నారు. అయితే ఈ వార్త‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని ఉపాస‌న తెలియ‌జేసింది. స‌ద్గురు అన్న వ్యాఖ్య‌ల ఉద్దేశం వేర‌ని.. అంతేకానీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఉపాస‌న స్ప‌ష్టం చేసింది.

Upasana finally given clarity on recent social media news
Upasana

సోష‌ల్ మీడియాలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పిల్ల‌ల్ని క‌నొద్ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. జ‌నాభా పెరిగిపోవ‌డం వ‌ల్లే వారు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. అయితే వాటిని చూసిన ఉపాస‌న ఇలా స్పందించింది. ఇదేదీ నిజం కాదు, సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లను న‌మ్మ‌కండి, నా కామెంట్స్‌ను మీరు త‌ప్పుగా అర్థం చేసుకున్నారు, ద‌య‌చేసి ఆ రోజు స‌ద్గురుతో నేను ఏం మాట్లాడానో మ‌రొక‌సారి ఆ వీడియోలో చూసి తెలుసుకోండి, ఫేక్ న్యూస్‌ను ప్ర‌చారం చేయ‌కండి.. అంటూ ఉపాస‌న పోస్ట్ పెట్టింది.

ఇలా ఉపాస‌న పోస్ట్ పెట్ట‌డంతో వారు పిల్ల‌ల్ని క‌నేందుకు సిద్ధంగానే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. కానీ మ‌రి 10 ఏళ్లు అవుతున్నా ఇంత వ‌ర‌కు ఆ క‌ల‌ను వారు ఎందుకు నిజం చేసుకోలేదు.. అన్న ప్ర‌శ్న మాత్రం మ‌ళ్లీ ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అయితే దీనికి మ‌ళ్లీ ఆమె స‌మాధానం చెబుతుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment