Sri Reddy : నూడుల్స్ తో అల‌రిస్తున్న శ్రీ‌రెడ్డి.. మ‌ళ్లీ న‌రేష్, ప‌విత్ర లోకేష్‌పై సెటైర్లు..!

July 14, 2022 4:11 PM

Sri Reddy : న‌టి శ్రీ‌రెడ్డి అప్ప‌ట్లో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్య‌మం ద్వారా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఆమె దెబ్బ‌కు సినీ పెద్ద‌లు జ‌డుసుకున్నారు. దెబ్బ‌కు దిగి వ‌చ్చి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ క‌మిటీ ఎటు పోయిందో, దాని ప‌రిస్థితి ఏమిటో ఇప్పుడు తెలియ‌దు కానీ.. శ్రీ‌రెడ్డి మాత్రం ఆ వివాదం ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. ఇక ఇప్పుడు చెన్నైకి మ‌కాం మార్చిన ఆమె వంట‌ల వీడియోలను పోస్ట్ చేస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది.

శ్రీ‌రెడ్డి తాజాగా మామిడి తోట‌లో నూడుల్స్ చేసి అల‌రించింది. తోట‌లో చిల‌క కొట్టిన జామ‌కాయ‌లు, ఉసిరికాయ‌ల గురించి తెలియ‌జేసింది. అంతేకాదు.. తోట‌లో మామిడి ప‌ళ్ల‌ను ఏరింది. వ‌య్యారాల‌ను ఒల‌క‌బోసింది. మీక్కూడా ఈ కాయ‌లు కావాలా.. అని అడిగింది. త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ వంట చేసింది. ఇలాంటి వాతావ‌ర‌ణం చూస్తే ఒళ్లు ఎంత‌గానో పుల‌క‌రిస్తుంద‌ని చెప్పింది. ఇక ప‌ల్లెటూరి రుచుల్లో పిల్ల‌ల కోసం నూడుల్స్ చేసింది.

Sri Reddy shared noodles cooking video viral
Sri Reddy

కాగా శ్రీ‌రెడ్డి నూడుల్స్ చేసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ముందుగా ఆమె అందుకు గాను కూర‌గాయ‌ల‌ను క‌ట్ చేసింది. త‌రువాత వాటితో నూడుల్స్ చేస్తూనే మ‌రోవైపు సీనియ‌ర్ జంట న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌పై సెటైర్లు వేసింది. అయితే శ్రీ‌రెడ్డికి ఇలా సెటైర్లు వేయ‌డం కొత్తేమీ కాదు. ఆమె ఇత‌ర విష‌యాల‌ను మాట్లాడుతూనే వేరే విష‌యాల‌పై కూడా చాలా తెలివిగా కౌంట‌ర్ వేస్తుంటుంది. ఈ మ‌ధ్య ఆమె నాగ‌బాబు కుమార్తె నిహారిక‌పై చేసిన కామెంట్లు కూడా వైర‌ల్ అయ్యాయి. కాగా శ్రీ‌రెడ్డి చేసిన నూడుల్స్ తాలూకు వీడియోను ఎంతో మంది ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

https://youtu.be/g0ilAWDOYcM

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now