The Warriorr Movie Review : రామ్ న‌టించిన‌.. ది వారియ‌ర్ మూవీ రివ్యూ..!

July 14, 2022 2:04 PM

The Warriorr Movie Review : గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కొత్త‌గా పోలీస్ పాత్ర‌లో న‌టించిన మూవీ.. ది వారియ‌ర్‌. ఈ మూవీ జూలై 14న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొత్తం 1300 థియేట‌ర్ల‌లో ఈ మూవీన రిలీజ్ చేశారు. ఈ క్ర‌మంలోనే సినిమాకు ముందు నుంచి పాజిటివ్‌గానే రెస్పాన్స్ వ‌స్తోంది. అలాగే ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. క‌థ ఏమిటి.. ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందా.. లేదా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

డీఎస్పీ స‌త్య (రామ్‌) ఒక నిజాయితీ క‌లిగిన పోలీస్ ఆఫీస‌ర్‌. అవినీతి ప‌రులు, గూండాల గుండెల్లో గుబులు పుట్టిస్తుంటాడు. వారి భ‌ర‌తం ప‌డుతుంటాడు. అయితే స‌త్య‌కు క‌ర్నూల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. దీంతో అక్క‌డికి వ‌చ్చి మ‌ళ్లీ య‌థావిధిగా డ్యూటీ చేస్తుంటాడు. అక్క‌డే విజిల్ మ‌హాల‌క్ష్మి (కృతి శెట్టి) ప‌రిచ‌యం అవుతుంది. ఆమె ఒక ఆర్‌జేగా ప‌నిచేస్తుంటుంది. అయితే స‌త్య పోలీస్ అన్న విష‌యం ఆమెకు తెలియ‌దు. కానీ ఇద్ద‌రూ క‌ల‌సి అక్క‌డ గురు (ఆది పినిశెట్టి) చేస్తున్న అరాచ‌కాల‌ను ఆపేందుకు య‌త్నిస్తుంటారు. అయితే అనుకోకుండా స‌త్య పోలీస్ అని మ‌హాల‌క్ష్మికి తెలుస్తుంది. దీంతో ఏమ‌వుతుంది ? గురు త‌న‌కు అడ్డు త‌గులుతున్న స‌త్య‌, మ‌హాల‌క్ష్మిల‌ను అడ్డు తొల‌గించుకోవాల‌నుకుంటాడా ? చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంది ? అన్న విష‌యాలు తెలియాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

The Warriorr Movie Review know how the movie is
The Warriorr Movie Review

విశ్లేష‌ణ‌..

ఇప్ప‌టి వ‌రకు ఎంతో మంది హీరోలు పోలీస్ పాత్ర‌ల్లో మెప్పించారు. ఈ క‌థ‌తో వ‌చ్చే సినిమాలు చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. క‌నుక రామ్ కూడా ఇదే క‌థ అయితే బాగుంటుంద‌న్న ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఆయ‌న ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కు మూవీ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ల‌వ‌ర్ బాయ్‌గా, మాస్ హీరోగా ఎలా అయినా చేయ‌గ‌ల‌డు. ఇక కృతిశెట్టి గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఆమె న‌టించ‌డం ఈ సినిమాకు ఇంకో ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌వ‌చ్చు. దీంతోపాటు విల‌న్‌గా ఆది పినిశెట్టి అద‌ర‌గొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ఇక ఇత‌ర న‌టీనటులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర బాగానే న‌టించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, పాట‌లు బాగుంటాయి. మొత్తంగా చెప్పాలంటే రామ్ చాలా రోజుల త‌రువాత పూర్తి స్థాయి మాస్ ఎంట‌ర్‌టైనర్‌తో మ‌న ముందుకు వ‌చ్చాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌క అల‌రిస్తుంది. ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now