Naga Chaitanya : స‌మంత‌ను టార్గెట్ చేసిన నాగ‌చైత‌న్య‌..? ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఎందుకు ఉన్న‌ట్లు..?

July 13, 2022 6:28 PM

Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా ఉన్న నాగ‌చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ విడిపోయి ఇప్ప‌టికి 9 నెల‌లు అవుతోంది. అయితే ఈ ఇద్ద‌రూ విడిపోయిన త‌రువాత ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా మారిపోయారు. కానీ సమంత మాత్రం అప్ప‌ట్లో మామ్ సెయిడ్ పేరిట అనేక సందేశాల‌ను పోస్ట్ చేసింది. అవ‌న్నీ ఇన్‌డైరెక్ట్‌గా చైతూనే టార్గెట్ చేస్తూ ఆమె పెట్టిన‌వే అని అన్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా స‌మ‌యం, సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా స‌మంత‌ను ఆడుకుంటూనే ఉన్నారు. అయితే ఇంత జ‌రుగుతున్నా చైతూ మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు త‌ప్ప‌.. స‌మంత‌పై ఏనాడూ కామెంట్స్ చేయ‌లేదు. కానీ తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే.. స‌మంత‌ను చైతూ టార్గెట్ చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

చైత‌న్య‌, రాశిఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన థాంక్ యూ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేస్తున్నారు. కాగా రాశిఖ‌న్నా, చైతూ ఇద్ద‌రూ ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌లోని ఓ డైలాగ్ మాత్రం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.

Naga Chaitanya targeted Samantha with thank you movie dialogues
Naga Chaitanya

థాంక్ యూ ట్రైట‌ర్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. దాన్ని చైతూ చెప్పాడు. ఒక మ‌నిషిని పట్టుకుని వేళ్లాడే ప్రేమ కంటే స్వేచ్ఛ‌గా వ‌దిలెయ్య‌గ‌లిగే ప్రేమ ఎంతో గొప్ప‌ది.. అనే డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని చైతూ స‌మంత‌ను ఉద్దేశించే చెప్పాడ‌ని అంటున్నారు. సినిమాలో కావాల‌నే ఆ డైలాగ్ పెట్టార‌ని, అలాంటి డైలాగ్స్ మూవీలో ఇంకా ఉన్నాయ‌ని అంటున్నారు. అయితే ఒక‌వేళ చైతూ గ‌న‌క స‌మంత‌ను టార్గెట్ చేస్తే అప్ప‌టి నుంచే ఆమెపై ఏదో ఒక‌టి ఇన్‌డైరెక్ట్‌గా పోసి చేసి ఉండేవాడు. కానీ అలా చేయ‌లేదు. మ‌ర‌లాంట‌ప్పుడు ఇప్పుడు స‌డెన్‌గా ఎందుకు ఇలా టార్గెట్ చేసి డైలాగ్స్ చెబుతున్నాడు.. అంటే.. ఈ మ‌ధ్య చైతూకు, శోభిత‌కు ఒక ల‌వ్ ట్రాక్ ఉంద‌ని వార్తలు వ‌చ్చాయి క‌దా.. వాటిని స‌మంత‌నే ప్ర‌చారం చేయించింద‌ని అన్నారు. క‌నుక‌నే ఆమెను టార్గెట్ చేస్తూ చైతూ అలా డైలాగ్స్ చెప్పాడ‌ని అంటున్నారు.

వాస్త‌వానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ముగిసింది. కానీ చైతూ, శోభిత‌ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ వార్త‌ల‌ను మొన్నీ మ‌ధ్య‌నే ప్ర‌చారం చేశారు. కాబ‌ట్టి పైన చెప్పిన వాద‌న అసంబ‌ద్ధ‌మ‌ని అనిపిస్తుంది. కానీ స‌మంత త‌న‌ను టార్గెంట్ చేస్తుంద‌ని అప్ప‌టి నుంచే మ‌న‌సులో పెట్టుకున్న చైతూ మూవీలో అలా డైలాగ్స్ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది క‌నుక ఎలాగూ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయాలి కాబ‌ట్టి చేశారు. అందులోని డైలాగ్స్‌నే ట్రైల‌ర్‌లోనూ పెట్టారు. కానీ ఇది ఉన్న‌ట్లుండి స‌మంత‌ను టార్గెట్ చేసిన‌ట్లు కాదు. ముందు నుంచి అనుకుంటున్నారేమో ఇప్పుడు వ‌ర్క‌వుట్ చేశారు. అయితే ఇవన్నీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లే. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అన్న‌ది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now