SS Rajamouli : రాజ‌మౌళికి నెట్‌ఫ్లిక్స్ రూ.100 కోట్లు ఆఫ‌ర్‌.. డీల్ మామూలుగా లేదు..!

July 12, 2022 9:35 PM

SS Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ మూవీ స‌క్సెస్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో ఆయ‌న ఖ్యాతి ఖండాంత‌రాల‌కు సైతం పాకింది. ఎంతో మంది విదేశీ సెల‌బ్రిటీలు సైతం ఈ మూవీని ప్ర‌శంసిస్తున్నారు. రాజ‌మౌళి ప్ర‌తిభ‌ను కొనియాడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మేనియా ముగిసింది క‌నుక ఇక రాజ‌మౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌తో ఆయ‌న తీయ‌బోయే సినిమా ఎలా ఉంటుందా.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ 2023లో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌హేష్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమా చేయ‌నున్నారు. ఇది ఆగ‌స్టులో ప్రారంభం కానుంది. ఈ మూవీ పూర్త‌య్యే స‌రికి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి అవుతుంద‌ని అంటున్నారు. క‌నుక ఆ త‌రువాతే మ‌హేష్.. రాజ‌మౌళితో సినిమా చేయ‌నున్నారు. ఇక ఈ మూవీని రూ.800 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి రూ.550 కోట్లు పెట్టారు క‌నుక ఈ మూవీకి అంత‌క‌న్నా ఎక్కువే కానుంది.

Netflix reportedly offered Rs 100 crores deal to SS Rajamouli
SS Rajamouli

ఇక రాజ‌మౌళి మ‌హేష్‌తో తీయ‌బోయే సినిమాకు విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో మూవీ ఉంటుంద‌ని ఆయ‌న ఇది వ‌ర‌కే హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అయితే తాజాగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రాజ‌మౌళికి ఓ భారీ డీల్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. రూ.100 కోట్ల‌ను ఆయ‌న‌కు అందుకు రెమ్యున‌రేష‌న్‌గా ఇస్తామ‌ని నెట్ ఫ్లిక్స్ తెలిపిందట‌.

త‌మ‌కు ఒరిజిన‌ల్ కంటెంట్ క‌లిగిన ఓ వెబ్‌సిరీస్‌ను తీసి పెట్టాల‌ని.. ఎలాంటి క‌థ అయినా స‌రే తాము నిర్మించేందుకు సిద్ధ‌మ‌ని.. వెబ్ సిరీస్‌ను తీసి ఇస్తే రూ.100 కోట్లు ఇస్తామ‌ని నెట్ ఫ్లిక్స్ రాజ‌మౌళికి ఆఫ‌ర్‌ను ఇచ్చింద‌ట‌. అయితే ఆయ‌న అందుకు ఓకే చెప్పారో లేదో తెలియ‌దు కానీ.. ఆయ‌న సాధార‌ణంగా ఒక ప్రాజెక్ట్ చేసే స‌మ‌యంలో ఇంకో ప్రాజెక్ట్‌కు ఒప్పుకోరు. ఒక వేళ ఒప్పుకున్నా ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ త‌రువాతే ఆ ప్రాజెక్ట్ చేస్తారు. క‌నుక మ‌హేష్‌తో మూవీని తీశాకే నెట్ ఫ్లిక్స్‌కు సిరీస్ చేసి పెడ‌తార‌ని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఎలాగూ 3 ఏళ్లు ప‌డుతుంది క‌నుక నెట్ ఫ్లిక్స్ అప్ప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే. మ‌రి అప్పుడైనా ఆయ‌న ఈ డీల్‌కు ఓకే చెబుతారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now