Sreemukhi : తొక్క‌లో వ‌ర్ష‌మ‌ట‌.. మ‌రి తిండి ఎక్క‌డి నుంచి వ‌స్తుంది శ్రీ‌ముఖీ..?

July 12, 2022 10:51 AM

Sreemukhi : వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే వ‌ర్షాలు బాగా ప‌డుతుంటాయి. కొన్నిసార్లు తుఫాన్‌, రుతు ప‌వ‌నాలు క‌ల‌సి భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది అదే. గ‌త వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున వ‌ర్షాలు పడుతున్నాయి. సూర్యుడు రాక దాదాపు వారం రోజులు అవుతోంది. ఈ క్ర‌మంలోనే ర‌హ‌దారులు ఎక్క‌డ చూసినా జ‌ల‌మ‌యంగా మారాయి. అలాగే నేల అంతా చిత్త‌డిగా బుర‌ద‌మ‌యంగా మారింది. దీంతో అలాంటి బుర‌ద‌లో న‌డ‌వాలంటే ఎవ‌రికైనా ఇబ్బంది ఉంటుంది. అది స‌హ‌జ‌మే కానీ.. రైతులు నిత్యం అదే బుర‌ద‌లో ప‌నిచేస్తుంటారు. దేశానికి కావ‌ల్సిన తిండి గింజ‌ల‌ను పండిస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే రైతులు వ‌ర్షాల కోసం ఎంత‌గానో ఎదురు చూస్తుంటారు. క‌నుక వ‌ర్షాలు ప‌డితే ఆనందం వ్య‌క్తం చేయాలి. అంతేకానీ వ‌ర్షాన్ని తిట్ట‌కూడదు. అలా తిడితే మ‌న‌కు వ‌చ్చే తిండిని తిట్టిన‌ట్లే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ తెలియ‌ని శ్రీ‌ముఖి వ‌ర్షాన్ని తిట్టేసింది. తొక్క‌లో వ‌ర్షం అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. వాస్త‌వానికి ఆమె వెళ్తున్న‌ది కారులో.. న‌డిచి కాదు.. అంత‌మాత్రాన వ‌ర్షాన్ని నిందించ‌డం ఎందుకు ? ఈ క్ర‌మంలోనే శ్రీ‌ముఖిని నెటిజ‌న్లు సైతం ట్రోల్ చేస్తున్నారు. నువ్వు వ‌ర్షాన్ని తిడుతున్నావు.. మ‌రి తిండి మ‌న‌కు ఎక్క‌డి నుంచి వ‌స్తుంది.. అని శ్రీ‌ముఖిని ప్ర‌శ్నిస్తున్నారు.

Anchor Sreemukhi comments on rain netizen angry on her
Sreemukhi

సోష‌ల్ మీడియా చేతిలో ఉంది క‌దా.. అని ఏ పోస్టులు పెడితే ఆ పోస్టుల‌కు నెటిజ‌న్లు లైకులు కొడ‌తారు అనుకుంటే పొర‌పాటు. సోష‌ల్ మీడియా దెబ్బ‌కు ప్ర‌స్తుతం బ‌డా బడా నేత‌ల కుర్చీలే క‌దిలిపోతున్నాయి. దాన్ని వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం వాడుకుంటే ఓకే. కానీ స‌మాజంలో ప్ర‌జ‌ల మనోభావాలు దెబ్బ తినేవిధంగా.. అర్థం ప‌ర్థం లేని వ్యాఖ్య‌లు చేయ‌డం ఎందుకు.. వారితో తిట్టించుకోవ‌డం ఎందుకు.. ఇదంతా అవ‌స‌ర‌మా.. శ్రీ‌ముఖి ఆలోచిస్తుంది కాబోలు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now