Kalyaan Dhev : నీ ప్రేమ ఉంటే నేను దేన్న‌యినా ఎదుర్కొంటా.. క‌ల్యాణ్ దేవ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌..

July 12, 2022 8:07 AM

Kalyaan Dhev : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌లు గ‌త కొంత కాలంగా విడిగా ఉంటున్నార‌నే విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది. వీరు గ‌తంలో ఎప్పుడూ క‌లిసే ఫొటోల్లో క‌నిపించేవారు. ఒక‌రి ఫొటోల‌ను ఒక‌రు షేర్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవ‌రి ఫొటోల‌ను వారే షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఆ ఫొటోల్లో వారు సింగిల్‌గానే క‌నిపిస్తున్నారు. క‌ల‌సి క‌నిపిండ‌చం లేదు. దీంతో వీరు విడిపోయార‌నే వార్త‌ల‌ను నెటిజ‌న్లు బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే విడాకులు అయ్యాయో.. కాలేదో.. తెలియ‌దు కానీ.. మెగా కాంపౌండ్‌కు క‌ల్యాణ్ దేవ్ దూర‌మ‌య్యాడు.. అనే విష‌యం మాత్రం.. నిజ‌మేన‌ని చాలా మంది న‌మ్ముతున్నారు.

ఇక క‌ల్యాణ్‌దేవ్ ప‌లు చిత్రాల్లో హీరోగా న‌టించాడు. అయితే గ‌తంలో మెగా ఫ్యామిలీ ఆయ‌న మూవీల‌ను ప్ర‌మోట్ చేసింది. కానీ ఈ మ‌ధ్య ఆయ‌న సినిమాల‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ఇటీవ‌ల వ‌చ్చిన క‌ల్యాణ్ దేవ్ మూవీలు.. కిన్నెర‌సాని, సూప‌ర్ మ‌చ్చి.. అస‌లు రిలీజ్ అయ్యాయ‌నే విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే శ్రీ‌జ‌, క‌ల్యాణ్‌దేవ్‌ల విడాకుల విష‌యం ఎప్ప‌టిక‌ప్పుడు వైర‌ల్ అవుతూనే ఉంది. దీనిపై క్లారిటీ మాత్రం రావ‌డం లేదు.

Kalyaan Dhev emotional post about his mother
Kalyaan Dhev

కాగా క‌ల్యాణ్ దేవ్ తాజాగా త‌న త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. హ్యాపీ బ‌ర్త్ డే అమ్మా.. కొన్ని సార్లు జీవితం చాలా క‌ష్టంగా మారుతుంది. కానీ నీ ప్రేమ అందించే శ‌క్తి ద్వారా నాకు ఎదుర‌య్యే ఎలాంటి అవ‌రోధాన్ని అయినా స‌రే దాటుకుని ముందుకు వెళ్ల‌గ‌ల‌న‌ని నాకు బాగా న‌మ్మ‌కం ఉంది. న‌న్ను ఎల్ల‌ప్పుడూ వెన్నంటి ఉండి ప్రోత్స‌హిస్తున్నందుకు థ్యాంక్స్‌. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. ల‌వ్ యూ అమ్మా.. అంటూ క‌ల్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టాడు. అయితే శ్రీ‌జ‌తో ఉన్న మ‌న‌స్ఫ‌ర్థ‌లు, ఆమె నుంచి విడిపోయిన కార‌ణంగా డిప్రెష‌న్‌లో ఉన్న క‌ల్యాణ్ దేవ్ ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉంటాడ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే వీరి విడాకుల వ్య‌వ‌హారంపై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now