Pushpa 2 : పుష్ప 2 బ‌డ్జెట్ రూ.350 కోట్లు ఫిక్స్‌.. అందులో అల్లు అర్జున్‌కు ఎంత ఇవ్వ‌నున్నారో తెలుసా ?

July 11, 2022 6:20 PM

Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప రిలీజ్ అయి ఇప్ప‌టికే 7 నెల‌లు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీకి ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. ఎక్క‌డ చూసినా ఈ మూవీ పాట‌లు, డైలాగ్సే వినిపిస్తున్నాయి. ఇందులోని డైలాగ్స్ కు ప్రేక్ష‌కులే కాదు.. సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్ర‌మంలోనే పుష్ప క్రేజ్ ఖండాంత‌రాల‌కు పాకింది. ఇక పుష్ప 2 కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది.

పుష్ప 2 సెప్టెంబ‌ర్‌లో లాంచ్ అయితే విడుద‌ల వేస‌విలోనే ఉంటుంద‌ని అంటున్నారు. క‌నుక 2023 వేస‌విలో ఈ మూవీ రిలీజ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇక మొద‌టి పార్ట్‌లో ఉన్న పాత్ర‌ధారులే ఇందులోనూ చాలా వ‌ర‌కు క‌నిపించ‌నున్నారు. కానీ కొంద‌రు కొత్త న‌టుల‌ను ఇత‌ర పాత్ర‌ల కోసం ఎంపిక చేస్తున్నారు. మ‌రోవైపు క‌థ‌పై సుకుమార్ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అయితే పుష్ప 2 గురించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీకి గాను రూ.350 కోట్ల‌ను బ‌డ్జెట్‌గా ఫిక్స్ చేశార‌ట‌. అలాగే ఇందులో న‌టీన‌ట‌లుకు ఇవ్వ‌నున్న మొత్తం గురించి కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

Pushpa 2 movie budget at rs 350 crores do you know about Allu Arjun remuneration
Pushpa 2

పుష్ప 2కు గాను సుకుమార్‌, అల్లు అర్జున్‌, ఇత‌ర న‌టీన‌టులకు కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్‌ను అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. పుష్ప మొద‌టి పార్ట్‌కు గాను అల్లు అర్జున్ రూ.45 కోట్ల‌ను తీసుకున్న‌ట్లు తెలుస్తుండ‌గా.. రెండో పార్ట్‌కు రూ.100 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ మొద‌టి పార్ట్‌కు రూ.18 కోట్ల‌ను తీసుకున్నార‌ట‌. దీంతో రెండో పార్ట్‌కు ఆయ‌న రూ.45 కోట్ల మేర తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. అలాగే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్ల‌కు రూ.75 కోట్ల వ‌ర‌కు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సినిమా బ‌డ్జెట్ రూ.350 కోట్ల‌కు పైగానే అవుతుంద‌ని అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం పుష్ప 2కు గాను ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా.. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now