Rakul Preet Singh : అత్యంత దీన‌స్థితిలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌..? మ‌రీ దారుణం..?

July 11, 2022 5:23 PM

Rakul Preet Singh : తెలుగు ప్రేక్ష‌కుల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉండేది. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈమె తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత నాన్న‌కు ప్రేమ‌తో, క‌రెంట్ తీగ‌, ధ్రువ వంటి సినిమాల్లో న‌టించి పాపుల‌ర్ అయింది. అయితే కొత్త హీరోయిన్లు వ‌స్తుండ‌డంతో ర‌కుల్‌కు స‌హ‌జంగానే అవ‌కాశాలు త‌గ్గాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడీమె బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.

అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌ప్పుడు తెలుగులో మ‌హ‌ర్జాత‌కురాలిగా వెలిగిపోయింది. కానీ బాలీవుడ్‌కు వెళ్ల‌డంతో అక్క‌డ ఈమెకు అంత‌గా అవ‌కాశాలు రాలేదు. మ‌రోవైపు తెలుగు తెర‌కు కూడా దూర‌మైంది. అయితే బాలీవుడ్‌లో ఈమె న‌టించిన చిత్రాలు హిట్ అయితే బాగానే ఉండేది. కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అక్క‌డ అవ‌కాశాల కోసం మ‌ళ్లీ ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అదే టాలీవుడ్‌లో ఉండి ఉంటే సమంత‌, త‌మ‌న్న‌లా కాస్త పాపులారిటీ అయినా ఉండేది. దాంతో ఏదో ఒక మంచి మూవీలో చాన్స్ ద‌క్కేది. కానీ ఆమె బాలీవుడ్‌కు వెళ్ల‌డంతో అక్క‌డ ఫ్లాపై ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవ‌డిలా ఆమె ప‌రిస్థితి మారిపోయింది. అక్క‌డ‌, ఇక్క‌డా.. అస‌లు అవ‌కాశాలు లేక దిక్కులు చూస్తోంది.

Rakul Preet Singh is in very helpful condition
Rakul Preet Singh

ఒక‌ప్పుడు ఈమె రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకుంది. కానీ ఇప్పుడు రోజుకు రూ.3 ల‌క్ష‌లు ఇచ్చినా స‌రే న‌టిస్తాన‌ని చెబుతోంద‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఈమెకు అవ‌కాశాలు రావ‌డం లేదు. ఆమె బాలీవుడ్‌కు వెళ్లి అన‌వ‌స‌రంగా త‌ప్పు చేసింద‌ని అంటున్నారు. దీంతో ర‌కుల్ ప్రీత్ సింగ్ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా.. అత్యంత ద‌య‌నీయంగా మారింద‌ని అంటున్నారు. అదే.. మ‌రి.. బ‌ళ్లు ఓడ‌లు అవ‌డం.. ఓడ‌లు బ‌ళ్లు అవ‌డం అంటే.. జీవితంలో ఎవ‌రికి ఎప్పుడు ఏం జ‌రుగుతుందో.. ఎవ‌రు ఏవిధ‌మైన ప‌రిస్థితికి చేరుకుంటారో.. ఎవ‌రూ చెప్ప‌లేరు. అందుకు ర‌కుల్ జీవిత‌మే ఉదాహ‌రణ అని చెప్ప‌వ‌చ్చు. మరి రానున్న రోజుల్లో ఆమె భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now