Meena : మీనాకు షాకిచ్చిన భ‌ర్త‌..? ఆయ‌న ఆస్తి ఆమెకు ద‌క్క‌ద‌ట‌..?

July 11, 2022 8:37 AM

Meena : న‌టి మీనా త‌న భ‌ర్త విద్యాసాగ‌ర్‌ను ఈ మ‌ధ్యే కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న క‌రోనా బారిన ప‌డి కోలుకున్న‌ప్ప‌టికీ ఊపిరితిత్తుల‌కు ఇన్‌ఫెక్ష‌న్ బాగా కావ‌డంతో ఆయ‌న‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఎన్నో రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన ఆయ‌న‌కు లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల‌ని చెప్పారు. కానీ దాత‌లు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆప‌రేష‌న్ చేయ‌లేక‌పోయారు. ఫ‌లితంగా ఆయ‌న ఈ మ‌ధ్యే క‌న్నుమూశారు. అయితే మీనా భ‌ర్త చ‌నిపోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. సినీ ఇండ‌స్ట్రీ పెద్దలు, సీనియ‌ర్ న‌టులు మీనా ఇంటికి వెళ్లి ఆమెను ఓదార్చారు.

ఇక మీనా భ‌ర్త చ‌నిపోవ‌డంతో అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆయ‌న‌కు రూ.250 కోట్ల ఆస్తి ఉంద‌ని, అయితే ఆస్తి త‌న‌కు ద‌క్క‌డం లేద‌న్న కార‌ణంతోనే మీనానే స్వ‌యంగా త‌న భ‌ర్త‌ను హ‌త్య చేయించింద‌ని వార్త‌లను ప్ర‌చారం చేశారు. ముఖ్యంగా కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువ‌గా ప్ర‌చారం అయ్యాయి. దీంతో స్పందించిన మీనా తాను భ‌ర్తను కోల్పోయిన బాధ‌లో ఉన్నాన‌ని.. ద‌య‌చేసి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయొద్ద‌ని.. త‌న‌కు ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని ఆమె ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా కోరింది. అయితే ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ ఇంకో విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది.

Meena husband Vidya Sagar might given his assets to daughter Nainika
Meena

మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ త‌న ఆస్తినంతా కుమార్తె నైనిక పేరిట రాశార‌ట‌. ఒక్క రూపాయి కూడా మీనాకు చెంద‌కుండా వీలునామా రాశార‌ట‌. నైనిక మేజర్ అవ‌గానే ఆమెకు, ఆమె భ‌ర్త‌కు ఆస్తి చెందేట్లు ఆయ‌న వీలునామాలో పేర్కొన్నార‌ట‌. దీంతో మీనాపై అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే నైనిక మేజ‌ర్ అయ్యేవ‌ర‌కు గార్డియ‌న్‌గా ఉండేవారు ఆస్తిని చూసుకోవాల‌ని వీలునామాలో ఉంద‌ట‌. దీంతో విద్యాసాగ‌ర్.. మీనాకు షాకిచ్చాడ‌ని అంటున్నారు. అయితే ఇవ‌న్నీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లే. ఇందులో నిజం ఎంత ఉంది అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now