Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు భ‌విష్య‌త్ ఏంటి ? అలా వ‌దిలేస్తారా ?

July 10, 2022 10:39 PM

Hari Hara Veera Mallu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం త‌న పార్టీ జన‌సేన కార్యక్ర‌మాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు. మ‌రో 2 ఏళ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ఆయ‌న ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఆయ‌న ఈ మ‌ధ్యే 8 కొత్త వాహ‌నాల‌ను కొన్నారు. అలాగే అక్టోబ‌ర్ 5 నుంచి 6 నెల‌ల పాటు బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు. దీంతో ఆయ‌న‌తో సినిమాలు చేద్దామ‌ని ఫిక్స్ అయిన నిర్మాత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఒప్పుకుని షూటింగ్ ద‌శ‌లో ఉన్న మూవీల‌ను మాత్ర‌మే పూర్తి చేస్తార‌ట‌. దీంతో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఈ ఏడాదికి పూర్త‌వుతుంద‌ని భావించారు. కానీ అది జ‌ర‌గ‌బోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం 2 ఏళ్లుగా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఈ మూవీని ఇప్ప‌టికే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. దీంతో ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్‌ను మ‌ళ్లీ మొద‌లు పెట్టారు కూడా. కానీ ఈ మూవీలో కొన్ని సీన్ల‌లో ప‌వ‌న్ చెప్పిన‌ట్లు ద‌ర్శ‌కుడు క్రిష్ మార్పులు చేయ‌లేద‌ట‌. దీంతో అసంతృప్తిని వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ ఆ మార్పులు చేసే వ‌ర‌కు షూటింగ్‌కు రాన‌ని చెప్పేశార‌ట‌. దీంతో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ ఆగిపోయింది.

Hari Hara Veera Mallu what is the future of this movie
Hari Hara Veera Mallu

అయితే ప‌వ‌న్ పాలిటిక్స్ నేప‌థ్యంలో ఈ మూవీ మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. మ‌రోవైపు ఈయన హీరోగా వినోద‌య సీత‌మ్ అనే మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. దీనిక గాను ఆయ‌న అక్టోబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ఇచ్చారు. కానీ హ‌రిమ‌ర వీర‌మ‌ల్లు భ‌విష్య‌త్తు ఏమిట‌నేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు క్రిష్, నిర్మాత ఏఎం ర‌త్నంలు ఈ నెల చివ‌ర్లో ప‌వ‌న్‌తో మీటింగ్ పెట్టి సినిమా షూటింగ్‌పై క్లారిటీని తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాక‌పోతే ఇక 2 ఏళ్ల వ‌ర‌కు ఈ మూవీని షూట్ చేయ‌లేరు. అదే జ‌రిగితే నిర్మాత‌కు భారీ న‌ష్టం రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ప‌వ‌న్ ఆ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు భ‌విత‌వ్యం ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now