Ravindra Jadeja : కెప్టెన్సీ ఆశ చూపించారు.. టీమ్ నుంచే లేపేశారు..?

July 10, 2022 12:04 PM

Ravindra Jadeja : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ జ‌ట్టును భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ విజ‌య‌వంతంగా న‌డిపించాడు. చెన్నై ప‌లు మార్లు ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసిందంటే అది ధోనీ ఘ‌న‌త‌నే అని నిర్మొహ‌మాటంగా చెప్ప‌వ‌చ్చు. అలాగే ధోనీతోపాటు చెన్నై జ‌ట్టు విజ‌యాల్లో ఇత‌ర ప్లేయ‌ర్ల కృషి కూడా ఎంతో ఉంది. వారిలో ర‌వీంద్ర జ‌డేజా ఒక‌రు. జ‌డేజా టీమ్‌కు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజ‌యాల‌ను అందించాడు. క‌నుక‌నే ఎంతో మంది ప్లేయ‌ర్లు వ‌చ్చి పోయినా చెన్నై జట్టులో అత‌నికి సుస్థిర స్థానం కూడా ల‌భించింది.

ఇక త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తోనూ ఆక‌ట్టుకున్న జ‌డేజా గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో చెన్నైకి కెప్టెన్ అయ్యాడు. ఆ సీజ‌న్‌కు ముందు ధోనీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో జ‌డేజాకు ఆ చాన్స్ ద‌క్కింది. అయితే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి ఐపీఎల్ సీజ‌న్‌లో చెన్నై దారుణ‌మైన ప‌రాజ‌యాల‌ను చ‌విచూసింది. దీంతో చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్‌కు కూడా చేర‌లేదు. లీగ్ ద‌శ‌లోనే నిష్క్ర‌మించింది. అలా జ‌ర‌గ‌డానికి ఒక‌టి రెండు మ్యాచ్ ల ముందే జ‌డేజా కెప్టెన్‌గా త‌ప్పుకున్నాడు. అయితే జ‌ట్టు వ‌రుస‌ల ఓట‌ముల‌కు బాధ్య‌త వ‌హించి జ‌డేజా ఆ నిర్ణ‌యం తీసుకున్నాడ‌నుకున్నా.. ఇప్పుడు అత‌ని వ్య‌వ‌హార శైలి చూస్తుంటే చెన్నై జ‌ట్టుకు, ధోనీకి, జ‌డేజాకు మ‌ధ్య చెడింద‌ని.. క‌నుక‌నే జ‌డేజా ఆ జ‌ట్టు నుంచి త‌ప్పుకుంటున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

Chennai Super Kings wantedly removing Ravindra Jadeja
Ravindra Jadeja

తాజాగా జ‌డేజా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే చెన్నై జ‌ట్టు ఫొటోలు అన్నింటినీ తొల‌గించాడు. దీంతో వ‌చ్చే సీజ‌న్‌లో అత‌ను చెన్నైకి ఆడ‌బోవ‌డం లేద‌నే విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మైంది. అయితే జ‌డేజా ఇంత అనూహ్యంగా ఎందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌నే విష‌యంపై జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. దీని వెనుక ఒక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంద‌ని అంటున్నారు. జ‌డేజాను పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టార‌ని, ధోనీతో అత‌నికి చెడింద‌ని.. క‌నుక‌నే అత‌ను అలా చేసి ఉండ‌వ‌చ్చ‌ని అంటున్నారు. అయితే జ‌డేజా మాత్రం మంచి ప్లేయ‌ర్ అని చెప్ప‌వ‌చ్చు. కెప్టెన్సీ విష‌యం పక్క‌న పెడితే జ‌ట్టును ఒంటి చేత్తో ముందుకు న‌డిపించ‌గ‌ల‌డు. అంత‌టి సామ‌ర్థ్యం ఉంది. కానీ జ‌డేజాను చెన్నై వ‌దులుకునేందుకు సిద్ధ‌మైందంటే.. ఏదో జ‌రిగే ఉంటుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

ఇక జ‌డేజా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక ఇంకో కార‌ణాన్ని కూడా చెబుతున్నారు. ఒక వ్య‌క్తిని అసమ‌ర్థుడిగా నిరూపిస్తే అత‌ని ప‌ట్ల ఏం చ‌ర్య తీసుకున్నా స‌మాజం పెద్ద‌గా స్పందించ‌దు. క‌నుక‌నే జ‌డేజాకు ముందుగా కెప్టెన్సీ ఆశ చూపించి అందులో అతను విఫ‌లం అయ్యాక ఇప్పుడు అత‌నిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని.. క‌నుక‌నే అది న‌చ్చ‌ని జడేజా చెన్నైతో క‌టీఫ్ చేసుకోబోతున్నాడ‌ని అంటున్నారు. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. చెన్నై జ‌ట్టు ఒక మంచి ప్లేయ‌ర్ ను కోల్పోయి ఇంకా బ‌ల‌హీనంగా మారుతుంద‌ని మాత్రం అంటున్నారు. మ‌రి వ‌చ్చే సీజ‌న్‌లో జ‌డేజా ఏ జ‌ట్టుకు ఆడ‌తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now