Anchor Suma : యాంక‌ర్ సుమ అంటే అల్ల‌రి కాదు.. గొప్ప మ‌న‌సు.. న‌చ్చావు పో..!

July 10, 2022 8:43 AM

Anchor Suma : తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు యాంక‌ర్ సుమ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో షోల ద్వారా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక ఈమె చేస్తున్న షోల‌లో క్యాష్ ఒక‌టి. ఇది ప్ర‌తి వారం ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతుంటుంది. ఇప్ప‌టికే ఈ షో విజ‌య‌వంతంగా కొన‌సాగుతూ ఎంతో మందిని అల‌రిస్తోంది. ఈ షోలో సుమ చేసే అల్ల‌రి మామూలుగా ఉండ‌దు. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తూ.. త‌న‌దైన శైలిలో గెస్ట్‌ల‌పై పంచ్‌లు వేస్తూ సంద‌డి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ షోకు సీనియ‌ర్ న‌టులు కృష్ణ‌వేణి, సుభాషిణి, జెన్నీ హాజ‌ర‌య్యారు. వీరు వ‌య‌స్సులో వృద్ధులు అయ్యారు కానీ.. యువ‌త‌లా మారి ఈ షోలో సంద‌డి చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ షోకు చెందిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుద‌ల చేయ‌గా అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

క్యాష్ లేటెస్ట్ ప్రోమోలో భాగంగా సుమ వారిచే అనేక ఫీట్లు చేయించింది. న‌టుడు జెన్నీ అయితే ఈ వ‌య‌స్సులోనూ అనేక క‌ష్ట‌మైన యోగా ఆస‌నాల‌ను వేసి షాకిచ్చారు. ఆయ‌న ఆరోగ్య ర‌హ‌స్యం ఇదా.. అని ప్రేక్ష‌కులు ఆశ్చర్య‌పోతున్నారు. అలాగే మీకు పెళ్లి క‌న్నా ముందు ఏమైనా ప్రేమ క‌థ‌లు ఉన్నాయా.. అని సుమ ఆయ‌న‌ను అడ‌గ్గా.. అందుకు మ‌ధ్య‌లో సుభాషిణి క‌ల‌గ‌జేసుకుని మాట్లాడుతూ.. అవును.. పెళ్లికి ముందు కాదు కానీ.. ఇప్పుడైతే చాలానే ఉన్నాయి.. అని అంటుంది. దీంతో అందరూ బిగ్గ‌ర‌గా న‌వ్వేస్తారు.

Anchor Suma helping Actress Subhashini netizen praise her
Anchor Suma

ఇక ప్రోమో చివ‌ర్లో సుభాషిణి కంటత‌డి పెట్టుకుంటుంది. తాను ఈ రోజు బ‌తికి ఉన్నానంటూ అందుకు కార‌ణం సుమ‌నే అని చెప్పింది. త‌న‌కు ఆరోగ్యం బాగాలేక‌పోతే సుమ ఎంత‌గానో స‌హాయం చేసింద‌ని.. ఆమె లేక‌పోతే తాను ఈ రోజు ఉండేదాన్ని కాద‌ని చెబుతూ సుభాషిణి ఏడ్చేసింది. దీంతో సుమ కూడా ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంటుంది. ఇక త‌న‌కు సుమ ఇప్ప‌టికీ స‌హాయం చేస్తూనే ఉంద‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు అవ‌స‌ర‌మైన మందుల‌ను పంపిస్తుంద‌ని.. సుభాషిణి తెలియజేసింది. దీంతో సుమ చేస్తున్న స‌హాయానికి, ఆమె గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇన్ని రోజులు సుమ అంటే అల్ల‌రి బాగా చేస్తుంద‌ని అనుకున్నాం కానీ.. ఆమెలో ఇంత మాన‌వ‌తా హృద‌యం దాగి ఉంద‌ని ఇప్పుడే అర్థ‌మైందని నెటిజ‌న్లు అంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్ జూలై 16వ తేదీన ప్ర‌సారం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now