Liger : విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ మూవీ.. అస‌లు లైగ‌ర్ అంటే అర్థం ఏమిటో తెలుసా ?

July 8, 2022 8:44 PM

Liger : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరున్న పూరీ జ‌గ‌న్నాథ్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న సినిమాను తెర‌కెక్కించే విధాన‌మే పూర్తిగా వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే త‌న‌దైన శైలిలో చిత్రాల‌ను తీస్తూ పూరీ దూసుకెళ్తున్నారు. త‌న కెరీర్‌లో ఎన్నో ఫ్లాపులు, ఎన్నో విజ‌యాల‌ను అందుకున్నారు. ఒక ద‌శ‌లో ఆర్థికంగా చితికిపోయారు. అయిన‌ప్ప‌టికీ రామ్‌తో ఇస్మార్ట్ శంక‌ర్ తీసి మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌ల‌సి లైగ‌ర్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తీస్తున్న లైగ‌ర్ చిత్రం నుంచి ఇటీవ‌లే విజ‌య్‌కి చెందిన ఓ న్యూడ్ పిక్‌ను వ‌దిలారు. ఇది ఎంతో సంచ‌ల‌నాన్ని సృష్టించింది. సినిమాకు కావ‌ల్సినంత ప‌బ్లిసిటీని తెప్పించ‌డం కోస‌మే పూరీ అలా చేశార‌ని అనుకున్నారు. ఇక ఇందులో విజ‌య్‌కు జోడీగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ గురించి మ‌నం చెప్పుకోవాలి. దీనికి లైగ‌ర్ అని పెట్టి.. సాలా క్రాస్ బ్రీడ్‌.. అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక లైగ‌ర్ అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Vijay Devarakonda Liger movie do you know Liger meaning
Liger

లైగ‌ర్ అనేది వాస్త‌వానికి ఒక క్రూర‌మృగం. ల‌య‌న్‌, టైగ‌ర్ అనే ఆంగ్ల అక్ష‌రాల‌ను క‌లిపి ఈ టైటిల్‌ను పెట్టార‌ని చాలా మంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే లైగ‌ర్ అనే జంతువు కూడా ఉంది. అయితే అది క్రాస్ బ్రీడ్‌. అందుక‌నే లైగ‌ర్ చిత్రానికి కూడా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్ష‌న్ వ‌చ్చేలా పెట్టారు. ఇక లైగ‌ర్ అంటే అర్థం ఏమిటంటే.. మ‌గ‌ సింహానికి, ఆడ పులికి పుట్టిన జంతువు అన్న‌మాట‌. అంటే క్రాస్ బ్రీడ్ జంతువు. క‌నుక‌నే దీన్ని లైగ‌ర్ అని పిలుస్తున్నారు. అయితే టైటిల్‌లో చూపించిన‌ట్లు లైగ‌ర్ మూవీలోనూ విజ‌య్ ఆ విధంగా ప్ర‌వ‌ర్తిస్తాడా.. అన్న‌ది సందేహంగా మారింది. ఇక ఈ విష‌యం సినిమా విడుద‌ల అయితేనే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now