Sobhita Dhulipala : నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ ట్రాక్‌.. క్లారిటీ ఇచ్చిన శోభిత ధూళిపాళ‌..

July 8, 2022 7:02 PM

Sobhita Dhulipala : ఈమ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల‌కు చెందిన అనేక వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఏది న‌మ్మాలో.. ఏది న‌మ్మొద్దో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి నెలకొంది. అయితే వాటిల్లో కొన్ని వార్త‌లు నిజం అవుతున్నాయి కూడా. ప‌విత్ర లోకేష్, న‌రేష్‌లు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అది నిజ‌మే అయింది. ఇక వారు పెళ్లి చేసుకోలేదు కానీ చేసుకుని ఉంటే అది కూడా నిజం అయి ఉండేది. దీంతో ఇత‌ర సెల‌బ్రిటీ గురించి వ‌స్తున్న వార్త‌లు కూడా నిజ‌మే అని న‌మ్ముతున్నారు. అలాంటి వార్త‌ల్లో నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ కు చెందిన ల‌వ్ ట్రాక్ వార్త కూడా ఒక‌టి. ఇది నిజ‌మ‌ని చాలా మంది న‌మ్మారు.

నాగ‌చైత‌న్య‌, శోభిత ఇద్ద‌రూ ల‌వ్‌లో ఉన్నార‌ని.. చైతూ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని.. ఆమెను ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌కు కూడా ప‌రిచయం చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ఆమెను ప‌లుమార్లు హోట‌ల్‌లో క‌లిశాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో వారు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే వాటిని నాగ‌చైత‌న్య పీఆర్ టీమ్ ఖండించింది. ఇక తాజాగా శోభిత‌కు కూడా ఇదే విష‌యంపై ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి.

Sobhita Dhulipala clarified about recent rumors on her
Sobhita Dhulipala

శోభిత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు నాగ‌చైత‌న్య గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అయితే ఆమె వాటికి చాలా తెలివిగా స‌మాధానాలు చెప్పింది. త‌న‌కు ట్విట్ట‌ర్‌లో ఖాతాలు లేవ‌ని.. త‌న పేరిట ఎవ‌రో పెట్టిన పోస్టుల‌ను న‌మ్మొద్ద‌ని.. త‌న‌కు కేవ‌లం ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే ఉంద‌ని.. ఏదైనా ఉంటే అందులోనే పోస్ట్ పెడ‌తాన‌ని చెప్పింది. దీంతో చైతూతో అలాంటి అఫెయిర్ ఏదీ లేద‌ని ఈమె ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింద‌ని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఖండించినా ముందు ముందు ఇవే వార్త‌లు నిజం కావ‌చ్చ‌ని కూడా అంటున్నారు. మ‌రి రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now