Rain Alert : ఏపీ, తెలంగాణ‌కు హెచ్చ‌రిక‌.. మూడు రోజుల పాటు అతి భారీ, అత్యంత భారీ వ‌ర్షాలు..

July 8, 2022 8:19 AM

Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ‌ర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అనేక చోట్ల లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కాగా వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. రుతుప‌వ‌నాల‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం తోడు కావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. కాగా మ‌రో మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణ‌ల‌లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం అధికారులు తెలియ‌జేశారు.

దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాల నుంచి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ, ఏపీల‌లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియ‌జేసింది. కాగా మిగతా రోజుల్లో ఒక‌ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

Rain Alert heavy and most heavy rains in next 3 days in Telangana and Andhra Pradesh
Rain Alert

కాగా తెలంగాణలో అనేక చోట్ల ఒక‌ మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా శుక్ర‌వారం తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని అన్నారు. ఇక ఈ జిల్లాల‌కు గాను ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు.

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్క‌డా భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. ఈ జిల్లాల‌కు గాను ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే 9వ తేదీన మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ క్ర‌మంలోనే శ‌నివారం ఈ జిల్లాల‌కు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now